వీడియో: కళ్ల ముందు భారీ కాలనాగు.. ఆ తల్లి గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే!

13 Aug, 2022 16:05 IST|Sakshi

వైరల్‌: కర్ణాటక మాండ్య నుంచి భయానక వీడియో ఒకటి సర్క్యులేట్‌ అవుతోంది. ఓ తల్లి సమయస్ఫూర్తితో భారీ విష సర్పం కాటు నుంచి బిడ్డను రక్షించుకుంది. రెప్పపాటులో ఆ బిడ్డకు ఘోర ప్రమాదమే తప్పింది. 

ఆ తల్లీబిడ్డలు ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వస్తున్న టైంలో ఈ ఘటన జరిగి ఉంటుందని స్పష్టం అవుతోంది. ఇంటి బయట మెట్ల కింద నుంచి పాము వెళ్తోంది. ఆ సమయంలో పామును గమనించకుండా ఆ చిన్నారి కిందకు కాలు వేయబోయాడు. అంతలో.. 


ఆ తల్లి చూపించిన తెగువ, సమయస్ఫూర్తిని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు పలువురు. ఎంతైనా అమ్మ కదా!

A post shared by India Today (@indiatoday)

మరిన్ని వార్తలు