పునీత్‌ మరణం: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

2 Nov, 2021 21:18 IST|Sakshi

బెంగళూరు(కర్ణాటక): కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణం అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్‌ మాట్లాడుతూ.. ఇక నుంచి జిమ్‌లు, ఫిట్‌నెస్‌ సెంటర్లలలో ట్రైనర్లకు ప్రథమ చికిత్స, ప్రత్యేక శిక్షణపై మార్గదర్శకాలను జారీచేస్తామని తెలిపారు. జిమ్‌లో వర్కవుట్స్‌ సమయంలో..  తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తామని తెలిపారు. అదే విధంగా, ట్రైనర్‌ పర్యవేక్షణ లేకుండా అధిక బరువులు ఎత్తకుండా జిమ్‌ నిర్వాహకులు చూడాలన్నారు.

రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె సుధాకర్‌, పలువురు కార్డియాలజిస్ట్‌లతో సమస్యను చర్చించి మరిన్ని మార్గదర్శకాలను జారీచేస్తామని పేర్కొన్నారు. కాగా, గత ఆదివారం 46 ఏళ్ల వయసులో జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూ గుండెపోటుతో.. కన్నడ నటుడు పునీత్‌రాజ్‌ కుమార్‌ మృతి చెందిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు