Karnataka: ఆర్టీసీ బస్సు ప్రయాణంలో సెల్‌ఫోన్‌లో పాటలు వింటున్నారా? ఇకపై జాగ్రత్త!

12 Nov, 2021 15:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరు: బస్సుల్లో, రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు చాలా మందికి మొబైల్‌లో పాటలు వినడం, సినిమాలు చూడటం అలవాటు ఉంటుంది. జర్నీ బోర్‌ కొట్టకుండా ఈజీగా టైమ్‌ గడిచిపోయేందుకు ఇది మంచి సాధనంగా ఉపయోగపడుతుంది.  కొంతమంది ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకొని ఎంజాయ్‌ చేస్తుంటే మరికొంతమంది లౌడ్‌ స్పీకర్‌తో పక్కన వారిని పట్టించుకోకుండా బయటకు వినపడేలా వింటున్నారు. ఈ  సౌండ్స్‌ వల్ల బస్సుల్లోని ఇతర ప్రయాణికులకు అప్పుడప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది.
చదవండి: అమెరికా వెళ్తున్నారా ? మోత మోగుతున్న విమాన ఛార్జీలు!

ఈ క్రమంలో కర్ణాటక ఆర్టీసీ సంస్థ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.. ఎవరైతే రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారో.. వారు మొబైల్‌ స్పీకర్ల ద్వారా పాటలు వినడాన్ని నిషేధించింది. బస్సులో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొద్దని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రాష్ట్ర రోడ్‌ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. 
చదవండి: ఈ యంత్రంతో ఢిల్లీ వాయుకాలుష్యం పరార్‌!! మామూలోడు కాదు..

గతంలో కోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఆధారంగా కర్ణాటక హైకోర్టు నిషేధం విధించాలని నిర్ణయించింది. బస్సులో అనవసర శబ్ధాల అంతరాయంపై ఆంక్షలు విధించాలని కోర్టులో పిటిషన్‌ దాఖలవ్వగా..  మొబైల్‌లో ఎక్కువ సౌండ్‌ పెట్టి పాటలు, వీడియోలను ప్లే చేసే వినియోగాన్ని పరిమితం చేయాలని పిటిషనర్‌ కోరారు.
చదవండి: వంటింట్లో పాలు పొంగిపోతున్నాయా?.. ఈ చిట్కా బాగుందే

ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక హైకోర్టు.. అధిక సౌండ్‌తో పాటలు ప్లే చేయవద్దని అలాగే తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని బస్సులోని అధికారులు (డ్రైవర్‌, కండక్టర్‌) ప్రజలకు తెలియజేయాలని ఆదేశించింది. ఒకవేళ ప్రయాణికుడు అధికారుల సూచనలను పాటించకపోతే ప్రయాణీకుడిని బస్సు నుంచి దింపవచ్చని హైకోర్టు పేర్కొంది. 

మరిన్ని వార్తలు