కరోనా రక్కసి మారణహోమం: 514 మంది మృతి

4 Jun, 2021 08:13 IST|Sakshi

కేసులు తగ్గినా పెరుగుతున్న మరణాలు ఆందోళనకరం

కొత్తగా 18,324 పాజిటివ్‌లు

నీ నేపథ్యంలోనే లాక్‌డౌన్‌ పొడిగింపు

సాక్షి, బెంగళూరు: కరోనా రక్కసి మారణహోమం కొనసాగిస్తోంది. కేసులు తగ్గినప్పటికీ మృత్యు బీభత్సం అదుపులోకి రావడం లేదు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 514 మంది కరోనాతో చికిత్స పొందుతూ ప్రాణాలొదిలారు. మరోవైపు 18,324 మంది కరోనా బారిన పడగా, 24,036 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 26,53,446 కి పెరిగింది. అందులో 23,36,096 మంది కోలుకున్నారు. 30,531 మంది కన్నుమూశారు. 2,86,798 మంది చికిత్స పొందుతున్నారు. మంగళ, బుధవారాల కంటే గురువారం కేసులు రెండువేల వరకూ పెరిగాయి.

బెంగళూరులో 3,533 పాజిటివ్‌లు..
బెంగళూరులో 3,533 పాజిటివ్‌లు, 7,672 డిశ్చార్జిలు, 347 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 11,74,275కు పెరిగింది. అందులో 10,25,614 మంది కోలుకున్నారు. 14,276 మంది కన్నుమూశారు. ప్రస్తుతం 1,34,384 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

1,82,306 మందికి టీకా..

  • మరో 1,50,168 నమూనాలను పరీక్షించగా, మొత్తం టెస్టులు 3,01,49,275 కు పెరిగాయి.   
  • 1,82,306 మందికి కరోనా టీకా ఇచ్చారు. మొత్తం వ్యాక్సిన్ల సంఖ్య 1,43,27,273 కు పెరిగింది.  

తాజా మరణాల్లో టాప్‌ 5 జిల్లాలు..  

  • బెంగళూరు సిటీ - 347
  • మండ్య - 14
  • హాసన్‌ - 14
  • మైసూరు - 12
  • బెంగళూరు రూరల్‌ - 11
Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు