అక్కడ బడికి పోతే బస్సెక్కినట్లే!

5 Jun, 2022 15:41 IST|Sakshi
బస్సును పోలినట్లుగా వేసిన పెయింటింగ్, చిత్రంలో విద్యార్థులతో విద్యాశాఖ అదనపు అధికారి సుఖదేవ్‌

రాయచూరు రూరల్‌(బెంగళూరు): మస్కి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గదికి చిత్రకారులు బస్సు రూపం తెచ్చారు. బస్సును పోలినవిధంగా వేసిన పెయింటింగ్‌ విద్యార్థులను ఆకట్టుకుంటోంది. జిల్లా విద్యాశాఖా అదనపు అధికారి సుఖదేవ్‌ శనివారం పాఠశాలను సందర్శించి పెయింటింగ్‌ను ఆసక్తిగా తిలకించారు. అనంతరం విద్యార్థులతో పలు విషయాలపై చర్చించారు. విద్యార్థుల్లో సృజనను పెంపొందించేందుకు కలికా చేతనను పకడ్బందీగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.


ఆయుష్మాన్‌ భారత్‌తో ప్రజల ఆరోగ్య సంరక్షణ
బళ్లారిఅర్బన్‌: ఆయుష్మాన్‌ భారత్‌తో ఆరోగ్య కర్ణాటక సాధ్యమని మాజీ ఎంపీ శాంత పేర్కొన్నారు. బళ్లారి తాలూకా రూపనగుడి గ్రామంలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో మంగళూరు శ్రీనివాస్‌ ఆస్పత్రి శనివారం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. రూపనగుడి గ్రామంలో మంత్రి శ్రీరాములు ఈ ఆస్పత్రి నిర్మించి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్య సంరక్షణకు పాటు పడ్డారన్నారు.

మంగళూరు శ్రీనివాస్‌ ఆస్పత్రి వైద్యుల సేవలు వెలకట్టలేనివన్నారు. అనంతరం బీపీఎల్, ఆధార్‌ కార్డు ఉన్న వారందరికి జనరల్‌ చెకప్, గుండె జబ్బులు, శ్వాసకోస, స్త్రీ రోగ, చెవి, గొంతు, ఎముకలు, థైరాయిడ్, గర్భకోశ తదితర వ్యాధులకు 8 మంది వైద్యులు చికిత్సలు చేశారు. స్థానికులతోపాటు అనంతపురం జిల్లానుంచి కూడా రోగులు వచ్చి వైద్యం చేయించుకున్నారు. గ్రామ పంచాయతీ అధ్యక్షులు నాగరాజ్, బీజేపీ ప్రముఖులు ఓబులేష్, గోవిందప్ప, ప్రకాష్, డాక్టర్‌.వీరేంద్రకుమార్, వైద్యులు ఆదర్శ, నివేదిత, రుచిక్, అభిజిత్, భార్గవి, యశ్వంత్, ప్రియాంక, విఘ్నేశ్‌ శెట్టి, వినిత్, వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు.

చదవండి: ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఓవరాక్షన్‌.. డెలివరీ బాయ్‌ అంటే అంత చులకనా.. వీడియో వైరల్‌      

మరిన్ని వార్తలు