రాసలీలల వీడియో : ఆ యువతి ఎక్కడ? 

5 Mar, 2021 04:38 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని పుకార్లు వస్తున్నాయి. మంగళవారం సీడీలు బయటకు రాగా, జార్కిహొళి బుధవారం రాజీనామా చేయడం తెలిసిందే. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది. పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె మొబైల్‌ నంబరు కూడా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. 

ఓ ఎమ్మెల్యే ఉన్నారా?  
ఓ శాసనసభ్యుడు సదరు యువతి వెనుక ఉన్నట్లు జార్కిహొళి అనుకూల వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ శతృత్వంతో ఆయనే రహస్య వీడియోలు తీయించి బయటికి తెచ్చాడని చెబుతున్నారు. 

చదవండి: (వీడియోలు వైరల్‌: కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు)

(కన్నడ నేతల రాసలీలలు.. ప్రతిసారీ రాజీనామాలు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు