రాసలీలల కేసు: ఆమె కోసం హైదరాబాద్‌కు.. 

16 Mar, 2021 03:57 IST|Sakshi

రాసలీలల కేసులో సిట్‌ దర్యాప్తు 

సాక్షి, బెంగళూరు: కన్నడనాట మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహొళి రాసలీలల వీడియో సీడీలో కనిపించే యువతి కోసం సిట్‌ పోలీసుల గాలింపు కొనసాగుతోంది. సీడీ విడుదల తరువాత ఆమె బెంగళూరు నుంచి ముంబయికి, అక్కడి నుంచి తిరుపతికి, ఆ తర్వాత హైదరాబాద్‌ చేరుకున్నట్లు గుర్తించి హైదరాబాద్‌లో వెతుకుతున్నారు.  

విచారణకు గైర్హాజరు.. 
మోసగించారని, బెదిరించారని మాజీ మంత్రిపై యువతి సోషల్‌ మీడియా ద్వారా బెంగళూరు కబ్బన్‌పార్కు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. విచారణకు రావాలని బాగల్‌కోటలో ఆమె ఇంటికి నోటీసులు అతికించినప్పటికీ ఆమె నుంచి స్పందన లేదు.  

ఖాతాలోకి 25 లక్షలు: ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీడీని సామాజిక కార్యకర్త దినేశ్‌ కల్లహళ్లికి అందజేసిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి రూ.25 లక్షల నగదు జమ అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. సదరు వ్యక్తిని విచారణ చేస్తున్నారు. వీడియోలో వినిపించిన గొంతు మీద అనుమానంతో  చిక్కమగళూరుకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్వర నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. 

చదవండి: (రాసలీలల కేసు: ఇంటి యజమానిని క్షమించాలని కోరిన యువతి)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు