స్టూడెంట్‌తో అసభ్య ఫోటోషూట్‌.. టీచర్‌ సస్పెండ్‌

30 Dec, 2023 10:39 IST|Sakshi

పదో తరగది విద్యార్ధితో ఫోటోషూట్‌ చేసి.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన టీచర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఈవో ఉమాదేవి పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. 

బీఈవో ఇచ్చిన నివేదిక ఆధారంగా చిక్కబళ్లాపూర్‌ జిల్లా విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సదరు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేస్తూ చర్యలు చేపట్టారు. ఈ మేరకు ప్రధాన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ (డీడీపీఐ) బైలాంజినప్ప ఉత్తర్వులు జారీ చేశారు

అసలేం జరిగిందంటే.. 
కర్ణాటకలోని చిక్కబళ్లపూర్‌లోని మురుగమళ్ల ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్ధులు, ఉపాధ్యాయులు విహారయాత్రకు వెళ్లారు. అక్కడ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్పలత, పదో తరగది చదువుతున్న విద్యార్ధితో కలిసి అసభ్యకరంగా ఫోటోలు దిగారు. 

టీచర్‌ అనే పదానికి అర్ధాన్ని మార్చేస్తూ స్టూడెంట్‌తో లవర్‌లాగా పోజులు ఇచ్చారు. ముద్దులు కౌగిలింతలతో హద్దులు మీరి ప్రవర్తించారు. విద్యార్ధి సైతం ఉపాధ్యాయురాలిని ఎత్తుకొని, ప్రేమతో ఆమె కొంగు లాగుతున్నట్లు ఫోటోలకు పోజులు ఇచ్చాడు. ఇంకేముంది ఈ ఫోటోలోను అమిత్‌ సింగ్‌ రాజవత్‌ అనే వ్యక్తి ట్విటర్‌లో పోస్టు చేయడంతో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఫోటోషూట్‌పై నెటిజన్లు మండుపడుతున్నారు. గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఆ పదవికి కలంకం తెచ్చే ప్రవర్తించిన టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక విద్యార్ధిపై కూడా చివాట్లు పెడుతున్నారు. వీళ్ల కారణంగా ఇతరులు చెడిపోయే ప్రమాదం ఉందని, ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాడు.  

మరోవైపు ఫోటోషూట్‌ సమాచారం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో)కి ఫిర్యాదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పాఠశాలకు వెళ్లి సైతం టీచర్‌తో గొడవకు దిగారు. దీంతో ఫిర్యాదు అందుకున్న బీఈవో ఉమాదేవి పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టి టీచర్‌ను సస్పెండ్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు