ప్రియురాలికి చివరి కాల్‌ చేసి.. నేను పోతున్నా, నువ్వు పెళ్లి చేసుకో

14 Aug, 2023 07:29 IST|Sakshi

దొడ్డబళ్లాపురం(బెంగళూరు): అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు చావు తథ్యమని తెలుసుకుని, ప్రియురాలికి వీడియో కాల్‌ చేశాడు, తన అంత్యక్రియలకు ఆహ్వానించిన కొంతసేపటికి ప్రాణం వదిలిన హృదయ విదారక సంఘటన నెలమంగలలో వెలుగు చూసింది. నెలమంగలకు చెందిన కిరణ్‌ అనే యువకునికి కొన్నిరోజుల కిందట కుక్క కరవడంతో పెద్దగా పట్టించుకోలేదు, దీంతో రేబిస్‌ వ్యాధి సోకింది.

తల్లిదండ్రులు అతన్ని బెంగళూరు నిమ్హాన్స్‌ ఆస్పత్రిలో చేర్చగా బతకడం కష్టమని వైద్యులు నిర్ధారించారు. కిరణ్‌ ప్రియురాలికి వీడియో కాల్‌ చేసి.. తాను ఇక బ్రతకనని తన అంత్యక్రియలకు తప్పక రావాలని, మీ నాన్న చూపించిన యువకుడినే పెళ్లి చేసుకుని, పుట్టే బిడ్డకు నా పేరు పెట్టాలని కోరాడు. తరువాత కొన్ని గంటలకు అతడు చనిపోయాడు. ఆగస్టు 9న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి    నిజాయితీకి నిలువుటద్దం కలాం: ఆ చెక్కను జిరాక్స్‌ తీసి, ఫ్రేమ్‌ కట్టించి

మరిన్ని వార్తలు