హాట్‌సీట్‌లో రైల్వే ఉద్యోగి.. 12 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి..

8 Sep, 2022 13:13 IST|Sakshi
అమితాబ్‌ బచ్చన్‌తో చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణదాస్‌ 

భువనేశ్వర్‌: విశేష ప్రేక్షక ఆదరణ పొందుతున్న కౌన్‌ బేనాగా కరోడ్‌పతి రియాల్టీ షో కార్యక్రమంలో తూర్పుకోస్తా రైల్వే ఖుర్దారోడ్‌ మండలం సిబ్బంది కృష్ణదాస్‌ పాల్గొన్నారు. ఆయన ఖుర్దారోడ్‌ మండలంలో చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు.

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఎదురుగా హాట్‌ సీట్‌లో కూర్చుని, 12 ప్రశ్నల వరకు చురుగ్గా సమాధానం చెప్పి, రూ.12 లక్షల 50 వేలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిఖ్యాత జగన్నాథుని ప్రసాదం అమితాబ్‌ బచ్చన్‌కు అందజేసినట్లు ఆయన తెలిపారు. కృష్ణదాస్‌ గెలుపు పట్ల తోటి సిబ్బంది ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.

చదవండి: (పగ తీర్చుకున్నాడు.. కాటేసి చంపేసిన పామును.. మెడలో వేసుకుని..)

మరిన్ని వార్తలు