Bharat Jodo Yatra: కాశ్మీర్‌లో బాంబు పేలుళ్లు.. రాహుల్‌ యాత్రపై వేణుగోపాల్‌ కీలక వ్యాఖ్యలు

21 Jan, 2023 19:25 IST|Sakshi

జమ్మూ కాశ్మీర్‌లోని నర్వాల్‌ వద్ద శనివారం ఉదయం బాంబు పేలుళ్ల ఘటన చోటుచేసుకుంది. ట్రాన్స్‌పోర్ట్ నగర్ యార్డ్ నంబర్ 7లో వరుస పేలుళ్ల ధాటికి తొమ్మిది మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ బాంబు దాడికి ఉగ్రవాదలు పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, వరుస బాంబు దాడుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లో రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జోడో యాత్రపై టెన్షన్‌ నెలకొంది. భారత్‌ జోడో యాత్ర ముందే ఇలా బాంబు దాడులు జరగడంతో రాహుల్‌ యాత్ర కొనసాగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, దాడి జరిగిన నర్వాల్‌ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వాహనాలు కొనుగోలు, అమ్మకాలు ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి. ఇలాంటి తరుణంలో రాహుల్‌ యాత్రపై సంగ్ధిదం నెలకొంది. 

కాగా, భారత్‌ జోడో యాత్రపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమలో కేసీ వేణుగోపాల్‌ ఏఎన్‌ఐతో​ మాట్లాడుతూ.. ‘ప్రణాళిక ప్రకారమే జమ్మూ కాశ్మీర్‌లో భారత్‌ జోడో యాత్ర కొనసాగుతుంది. యాత్ర ప్రారంభానికి రెండు వారాల ముందుగానే నేను లెప్ట్‌నెంట్‌ గవర్నర్‌ను కలిశాను. భద్రత విషయంపై ఆయనతో చర్చించాను. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులందరూ భద్రతా సిబ్బందితో నిరంతరం టచ్‌లోనే ఉన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవడం వారి బాధ్యత. రాహుల్‌ యాత్ర ఎట్టిపరిస్థితుల్లో కొనసాగుతుంది. భద్రత విషయం భద్రతా సిబ్బంది చూసుకుంటారు’ అని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు