పోలీసుల ఓవరాక్షన్‌.. సీనియర్‌ నేతకు చేదు అనుభవం.. వీడియో వైరల్‌

13 Jun, 2022 17:39 IST|Sakshi

దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తతకర పరిస్థితులు నెలకొన్నాయి. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు ద‌ర్యాప్తులో భాగంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారిస్తోంది. ఈ క్రమంలో పోలీసులు.. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ధ భారీ సంఖ్యలో మోహరించారు. 

కాగా, రాహుల్ గాంధీకి మ‌ద్ద‌తుగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు భారీ ర్యాలీ నిర్వ‌హించారు. అక్కడే బందోబస్తులో ఉన్న ఢిల్లీ పోలీసులు.. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల ర్యాలీని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ప‌లువురు కాంగ్రెస్‌ నాయ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 

దీంతో, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతకు చేదు అనుభవం ఎదురైంది. నిరసన తెలుపుతూ.. ఈడీ కార్యాల‌యం వైపు ర్యాలీగా వెళ్తున్న ఏఐసీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, రాజ్య‌స‌భ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ను పోలీసులు లాక్కెళ్లారు. ఆయ‌న‌ను ఎత్తుకెళ్లి పోలీసు వాహ‌నంలో ఎక్కించి తుగ్ల‌క్ రోడ్డు పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాస్ బీవీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ ప‌ట్ల ఢిల్లీ పోలీసులు అనుచితంగా ప్ర‌వ‌ర్తించారని ఆగ్రహం వ‍్యక్తం చేశారు. పోలీసుల తీరు తీవ్రంగా ఖండించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని ఆయన మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌ కార్యాల‌యం వ‌ద్ద టెన్షన్‌.. టెన్షన్‌

మరిన్ని వార్తలు