మోదీ టార్గెట్‌ చేశారు.. మా విద్యాశాఖ మంత్రి అరెస్ట్‌ అవుతారు

2 Jun, 2022 12:20 IST|Sakshi

ఢిల్లీ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఢిల్లీ సర్కార్‌ వర్సెస్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

కేజ్రీవాల్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అరెస్ట్‌ చేస్తారని తెలిపారు. కేంద్ర ఏజెన్సీలు మనీష్ సిసోడియాను ఫేక్ కేసులో అరెస్ట్ చేయాలని భావిస్తున్నాయని అన్నారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వం.. కేంద్ర ఏజెన్సీలను ఆదేశించిందని ఆయన ధృవీకరించారు. ఈ క్రమంలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. 

"భారతదేశంలో విద్యా విప్లవానికి మనీష్ సిసోడియా స్థాపకుడు. 18 లక్షల మంది విద్యార్థులను అడుగుతున్నాను.. మనీష్ సిసోడియా అవినీతిపరుడా? అలాగే.. సిసోడియా తల్లిదండ్రులను కూడా అడుగుతున్నాను.. కేంద్రం మనీష్ సిసోడియా అవినీతిపరుడని అంటోంది.. మీరు ఏమనుకుంటున్నారు’’ అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. ఈ సందర్బంగానే ఢిల్లీలో సుపరిపాలనను అడ్డుకోవడమే కేంద్రం టార్గెట్‌. ఆప్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ అరెస్ట్‌ చేయండి అంటూ ఫైరయ్యారు. 

ఇది కూడా చదవండి: బీజేపీ గూటికి కాంగ్రెస్‌ కీలక నేత.. ట్విట్‌ వైరల్‌

మరిన్ని వార్తలు