ఊదబోయి.. గుటుక్కున మింగేసింది!

20 Feb, 2021 00:21 IST|Sakshi

మనం అనుకోకుండా చేసే పొరపాట్లకు కొన్నిసార్లు పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కేరళకు చెందిన ఓ 40 ఏళ్ల మహిళ .. చిన్నప్పుడు చేసిన ఓ పొరపాటు 25 ఏళ్ల తరువాత బయటపడడంతో ఆమెతోపాటు..డాక్టర్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. కేరళలోని కన్నూర్‌ జిల్లా మట్టన్నూరుకు చెందిన ఓ మహిళ శ్వాస సంబంధిత సమస్యతో డాక్టర్‌ దగ్గర చూపించుకునేందుకు వెళ్లింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆమె శ్వాసకోసవ్యవస్థలో ఒక విజిల్‌ ఉన్నట్లు గుర్తించారు. శ్వాసనాళంలో ఉన్న విజిల్‌ కారణంగా శ్వాససంబంధ సమస్యలు వస్తుండడంతో సర్జరీ చేసి దానిని బయటకు తీశారు డాక్టర్లు.

తాను ఓ 25 ఏళ్ల క్రితం ఒకసారి విజిల్‌ ఊదుతూ పొరపాటున మింగేశానని, అయితే అదిగమనించి ఎక్కువగా నీళ్లు తాగేశానని, అది ఎప్పుడో బయటకు వచ్చేసి ఉంటుందని అనుకున్నాను కానీ ఇంత పని చేస్తుందనుకో లేదని వాపోతోందామె! అప్పట్లో మింగిన ఆ విజిల్‌ కాస్తా ఆమె శ్వాసనాళంలోకి చేరింది. అప్పటి నుంచి ఇప్పటిదాక అది అక్కడే ఉండడంతో ఆమె రెండు దశాబ్దాలుగా దగ్గుతో సతమతమయ్యేది. ఊపిరి పీల్చుకోవడం కూడ కష్టమయ్యేది. విజిల్‌ తీశాక ప్రస్తుతం తనకు ఏ సమస్యా లేదంటోంది. 

చదవండి: (సన్నీ ఇది చాలా విడ్డూరం.. అందుకే అకాల వర్షాలు)

మరిన్ని వార్తలు