కేరళ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

28 Jul, 2021 13:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేరళ ప్రభుత్వానికీ సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం కొట్టేవేసింది. ఆరుగురు సీపీఎం ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసు విచారణను ఉపసంహరించుకోవాలన్న కేరళ ప్రభుత్వ పిటిషన్‌ సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేసిన చట్టం కింద ఆరుగురు ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచేప్పింది. దేశంలో అందరికీ ఒకే చట్టం వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2015లో కేరళ అసెంబ్లీలో సీపీఎంకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు