అనుపమ అలుపెరగని పోరాటం...ఎట్టకేలకు చెంతకు చేరిన బిడ్డ!!

24 Nov, 2021 21:25 IST|Sakshi

Kerala Baby Kidnap Case Finally Woman Gets Custody Of Her Infant Sonకేరళ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఓ సంఘటన ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. స్వయంగా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టిన కేసు ఇది. అనుపమ అనే ఓ తల్లి తన బిడ్డ కోసం చేస్తున్న పోరాటంలో కేరళ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం భాగమైన సంగతి తెలిసిందే. పైగా యావత్తు ప్రజలంతా కూడా ఆ తల్లికి న్యాయం జరగాలని ఆకాంక్షించిన విచిత్రమైన కేసు ఇది. అయితే అనుపమ ఎస్‌ చంద్రన్‌  గతేడాది అక్టోబర్‌లో ఓ బిడ్డకు తల్లి అయిన సంగతి విధితమే. అంతేకాక ఆమె కేరళ సమాజంలో అగ్రవర్ణంగా గుర్తింపు పొందిన సామాజిక వర్గానికి చెందిన మహిళ. పైగా ఆమె ప్రేమించిన వ్యక్తి షెడ్యూల్డ్‌ కులానికి చెందిన వ్యక్తి కావడంతో ‍స్వయానా ఆమె తండ్రే బిడ్డను కిడ్నాప్‌ చేసి కూతుర్నీ మోసం చేస్తూ మభ్యపెడుతూ వచ్చాడు. దీంతో ఆమె తన ప్రేమికుడితో కలసి పోలీస్‌ కంప్లయింట్‌ ఇచ్చింది.

(చదవండి: చట్టానికి ఎవరూ అతీతులు కారు: కంగనాకు కౌంటర్‌)

అయితే ఆమె తండ్రి సమాజంలో పరపతి కలిగిన వ్యక్తి, కమ్యూనిస్ట్‌ నాయకుడు కావడంతో పోలీసులు అరెస్టు చేయకుండా వెనుకడుగు వేస్తున్నారంటూ శిశు సంక్షేమ శాఖతోపాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులను, ముఖ్యమంత్రిని వేడుకుంది. దీంతో ప్రభుత్వ  యంత్రాంగం మొత్తం కదిలివచ్చి ఆమె బిడ్డను సత్వరమే వెతికే చర్యలు తీసుకోవడమే కాక సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన కేరళ పోలీసులు ఆ బిడ్డను సొంత రాష్ట్రానికి తీసుకువచ్చింది. అంతేకాదు ఆ బిడ్డ ఆ తల్లికే చెందాలని అక్కడి రాష్ట్ర ప్రజలందరూ ఆకాంక్షించారు. డీఎన్‌ఏ పరీక్షలు పూర్తి అయ్యేంత వరకు జిల్లా చైల్డ్‌ ప్రొటెషన్‌ ఆఫీసర్‌ సంరక్షణలో ఉంచుతారని చెప్పడంతో అనుపమ ఎంతో ఆవేదనగా ఎదురుచూస్తూ ఉంది. ఈ మేరకు న్యాయమూర్తి ఛాంబర్‌లో గంటన్నరసేపు జరిగిన విచారణలో నిర్మల శిశు భవన్‌లో సీడబ్ల్యూసీ కస్టడీలో ఉన్న బాబుని కోర్టు ఆదేశాల మేరకు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

అంతేకాదు బాబుకి అన్ని వైద్యపరీక్షలు నిర్వహించడమే కాక  చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసిన సత్వరమే ఆ చిన్నారిని తల్లికి అప్పగించాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ(సీడబ్ల్యూసీ)ని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కోర్టు ఈ కేసును నవంబర్ 30కి వాయిదా వేసింది. అయితే శిశువును వీలైనంత త్వరగా తల్లిదండ్రులకు అప్పగించాలని ప్రభుత్వ ప్లీడర్ విజ్ఞప్తి చేయడంతో ఎట్టకేలకు అనుపమ ఒడికి ఆ చిన్నారి చేరుకుంది. అంతేకాదు సంవత్సరం నిరీక్షణ వారాల న్యాయ పోరాటాలు అన్ని ఫలించి ఈ రోజు అనుపమ తన భర్త అజిత్‌తో కలిసి తన చిన్నారిని ఎత్తుకుని ఆనందంగా కోర్టు నుంచి బయటకు వచ్చింది. అయితే మూడు రోజుల వయస్సు ఉన్నప్పుడు ఆమె చివరిసారిగా చూసిన తన బిడ్డ సంరక్షణ బాధ్యతను కోర్టు నేడు ఆమెకు అప్పగించింది.

(చదవండి: వామ్మో!...పైప్‌లైన్లో నోట్ల కట్టలు..!!)

మరిన్ని వార్తలు