మేం అధికారంలోకి వస్తే యాంటీ లవ్‌ జీహాద్‌ చట్టం

8 Feb, 2021 20:00 IST|Sakshi

కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్

తిరువనంతపురం : తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేరళ రాష్ట్రంలో ‘లవ్‌ జీహాద్‌’కు వ్యతిరేకంగా చట్టాలు చేస్తామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్రన్‌ వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చినట్లుగా ‘యాంటీ లవ్‌ జీహాద్‌’ చట్టాన్ని తెస్తామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ప్రస్తుతం లవ్‌ జీహాద్‌ ఓ పెద్ద తలనొప్పిగా మారింది. హిందూ ధార్మిక సంస్థలు మాత్రమే కాదు! క్రిస్టియన్‌ సంస్థలు,  చర్చీలు కూడా లవ్‌ జీహాద్‌కు వ్యతిరేకంగా చట్టాలు తేవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అందుకని వచ్చే ఎన్నికలకు సంబంధించిన మా మేనిఫెస్టోలో ‘యాంటీ లవ్‌ జీహాద్ చట్టం‌’ను పొందుపరుస్తాం. ఉత్తర ప్రదేశ్‌లోలా చట్టాన్ని తెస్తాము’’ అని అన్నారు. ( మేం రెడీ.. డేట్‌ ఫిక్స్‌ చేయండి: అన్నదాతలు )

కాగా, మరికొన్ని నెలల్లో కేరళలోని 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేపనిలో పడ్డాయి. తమ విధానాలకు తగ్గట్టు హామీలు గుప్పిస్తున్నాయి. ప్రధాన పార్టీలైన సీపీఐ(ఎమ్‌), కాంగ్రెస్‌, బీజేపీల మధ్య పోరు నడుస్తోంది. ఎప్పటిలాగే కూటములతో బరిలోకి దిగనున్నాయి.

మరిన్ని వార్తలు