ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కక్ష కట్టిందా అన్న రేంజ్‌లో బాలుడిపై కుక్క దాడి!

13 Sep, 2022 09:08 IST|Sakshi

వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. తన మట్టుకు తాను ఆడుకుంటుడగా ఓ బాలుడిపై వీధి కుక్క దాడికి చేసి తీవ్రంగా గాయపరించింది. బాలుడిపై కక్ష గట్టిందా అన్న రేంజ్‌లో దాడి చేసి గాయపరిచింది. కాగా, ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల ప్రకారం.. కోజికోడ్‌ జిల్లాలోని అరక్కినార్​లో సైకిల్​ వస్తున్న ఓ బాలుడిపై వీధి కుక్క ఆకస్మికంగా దాడికి పాల్పడింది. విచక్షణారహితంగా చేతులు, కాళ్లపై కాట్లు వేసింది. బాలుడు వెంటనే పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి పారిపోయి కుక్క దాడి నుంచి తప్పించుకున్నాడు. కాగా, బాలుడిపై కక్ష కట్టిందా అన్న రేంజ్‌లో కుక్కు దాడి చేసింది. ఇక, స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజీ ఆధారంగా దాడి జరిగిన ఘటన బయటకు వచ్చింది. 

అలాగే, కేరళలోని మరో ప్రాంతంలో సైతం కొందరు విద్యార్థులను వీధి కుక్కలు తరిమిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో విద్యార్థులు పరిగెత్తుకుని వచ్చి.. ఓ ఇంట్లో గేటు వేసి దాడి నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలపై నెటిజన్లు స్పందిస్తూ.. కేరళను డాగ్స్‌ ఓన్‌ కంట్రీ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు