భర్తకు భలే ఆఫరాచ్చిన భార్య.. సోషల్‌ మీడియా ట్రెండింగ్‌లో దంపతులు

12 Nov, 2022 19:28 IST|Sakshi

మానవ జీవితంలో వివాహ బంధం అనేది ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. వివాహ బంధంలో ఎన్నో ఆనందాలు, సమస్యలు, ఒడిదుడుకులు, సర్దుకుపోవడం వంటివి సర్వసాధారణం. ముఖ్యంగా నూరేళ్ల వివాహం బంధంలో ఇద్దరూ సమయాన్ని బట్టి సర్దుకుపోవాలని పెద్దలు చెబుతూనే ఉంటారు. అయితే, ప్రస్తుత జనరేషన్‌లో పెళ్లికి ముందే వధువరులిద్దరూ తమ అభిప్రాయాలను షేర్‌ చేసుకుంటున్నారు.

పెళ్లి తరువాత ఎలా ఉండాలి.. ఎలా ఉండకూడదు.. ఏం చేయాలి? ఏం చేయకూడదు అనే ఒప్పందానికి వస్తున్నారు. కాగా, తాజాగా కేరళకు చెందిన ఓ పెళ్లి జంట.. వివాహం సమయంలో చేసుకున్న ఓ అగ్రిమెంట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. పెళ్లి సమయంలో వారిద్దరి మధ్య జరిగిన బాండ్‌ పేపర్‌ ఒప్పందం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఇంతకీ వారు ఏం చేశారంటే..?

కేరళకు ఓ వధువు.. తన భర్తను రాత్రి 9 గంటల వరకు అతని స్నేహితులతో గడిపేందుకు అంగీరిస్తానని, ఆ సమయంలో అతనికి ఫోన్ కాల్స్ చేయనని ఒప్పంద పత్రంపై సంతకం చేసింది. ఈ మేరకు వారికి నమ్మకం కుదిరేలా.. 50 రూపాయల బాండ్ పేపర్‌పై ఒప్పంద నియమాలు రాసి మరీ సంతకాలు చేసుకున్నారు. ఈ బాండ్ పేపర్‌పై సాక్షుల సంతకాలు కూడా తీసుకున్నారు.

వివరాల ప్రకారం.. కేరళకు చెందిన అర్చనతో రఘుకు పెద్దలు వివాహం నిశ్చయించారు. ముహుర్తం ప్రకారం వీరద్దరికీ నవంబర్‌ 5వ తేదీన పాలక్కాడ్‌లోని కంజికోడ్‌లో వివాహం జరిగింది. అయితే, పెళ్లి సందర్భంగా వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన ఒప్పందం జరిగింది. పెళ్లి అయిన తర్వాత తన భర్త రఘు.. రాత్రి 9 గంటల వరకు తన స్నేహితులతో బయట తిరిగేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పకూడదు అన్నది ఒప్పందం. ఆ సమయంలో ఆమె తన భర్తకు ఎలాంటి ఫోన్ కాల్స్ కూడా చేయరాదు అని కూడా అగ్రిమెంట్‌లో ఉంది. దీనికి వధువు అర్చన ఓకే చెప్పింది. అంతేకాకుండా 50 రూపాయల బాండ్ పేపర్‌పై ఆమె సంతకం కూడా పెట్టింది. అనంతరం.. ఈ బాండ్‌ పేపర్‌ను వరుడు రఘు స్నేహితులు.. కొత్త జంటకు బహుమతిగా అందించారు. కాగా, ఈ బాండ్‌ పేపర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు