‘మావల్ల కాదు.. మేం పంపలేం’ ప్రధానికి సీఎం లేఖ

10 May, 2021 17:35 IST|Sakshi

తిరువనంతపురం: ‘ప్రస్తుతం మా రాష్ట్రంలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. పెద్ద ఎత్తున కరోనా బాధితులు చేరుతుండడంతో అవసరమైన వారికి ఆక్సిజిన్‌ అందించే పరిస్థితి ఇప్పుడు లేదు. మాకే కొరతగా ఉంది.. ఇక ఇతరులకు మేం పంపలేం’ అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా కేరళలో నెలకొన్న కరోనా పరిస్థితులను లేఖలో సీఎం పినరయి వివరించారు. 

‘ఆక్సిజన్‌ నిల్వలతో పాటు పలు విషయాలపై సోమవారం సీఎం పినరయి విజయన్‌ ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్రంలో 219 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఇన్నాళ్లు ఇతర రాష్ట్రాలకు పంపాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్‌ ఇతరులకు పంపలేం. ఆక్సిజన్‌ నిల్వలు 450 టన్నుల నుంచి 80 టన్నులకు చేరింది. ఇకపై తమిళనాడు, కర్నాటకకు ఆక్సిజన్‌ పంపడం కుదరదు. మీరే ఆక్సిజన్‌ విషయంలో కేరళకు సహాయం చేయాలి. ద్రవ పదార్థ ఆక్సిజన్‌ సరఫరా కోసం క్రయోజనిక్‌ ట్యాంకర్లు పంపండి. ప్రస్తుతం కేరళలో నాలుగు లక్షలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. భవిష్యత్‌లో అవి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్‌ సరఫరా కుదరదు.’ 

చదవండి: రాజకీయాల్లో చిచ్చురేపిన అల్లుడి పెళ్లి బరాత్‌
చదవండి: గంగానదిలో తేలిన కరోనా మృతదేహాలు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు