‘దోషిగా తేలితే నా కొడుక్కి ఉరిశిక్ష వేయండి’

5 Sep, 2020 14:56 IST|Sakshi

సాక్షి, తిరువనంతపురం: కన్నడనాట డ్రగ్స్‌ మాఫియా వ్యవహారం కలకలం రేపుతోంది. ఇ‍ప్పటికే పలువులు సినీ ప్రముఖులకు నార్కొటిక్స్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు నోటీసులు జారీ చేయగా.. మరికొంత మంది పేర్లు బయటికి వచ్చే అవకాశముంది. అయితే, కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసుకు, బెంగుళూరులో డ్రగ్స్‌ మాఫియాకు సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేరళ సీపీఎం కార్యదర్శి కుమారుడు, నటుడు బినీష్‌ కొడియేరి పేరు సాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో తాజాగా బయటపడింది. డ్రగ్‌ పెడ్లర్‌ మహ్మద్‌ అనూప్‌ను ఎన్‌సీబీ అధికారులు శుక్రవారం విచారించగా బినీష్‌ పేరు బయటికొచ్చింది.

అయితే, ఈ ఆరోపణలపై స్పందించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలక్రిష్ణన్‌.. తన కొడుకు దోషిగా తేలితే శిక్షించండని అన్నారు. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే సరిపోదని, రుజువులు ఉంటే చూపాలని సవాల్‌ విసిరారు. ఒకవేళ తన కొడుకు ఉరిశిక్ష పడేంత నేరం చేస్తే, ఆ శిక్ష విధించాలని మీడియాతో అన్నారు. కాగా, సెప్టెంబర్‌ 2న యూత్‌ లీడర్‌ పీకే ఫిరోజ్‌ కుడా బినీష్‌పై ఆరోపణలు చేశాడు. అతనికి డ్రగ్స్‌ డీలర్లతో సంబంధాలున్నాయని చెప్పాడు. ఇదిలాఉండగా..  కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు నిందితురాలుస్వప్న సురేశ్‌ బెంగుళూరులో జూన్‌ 10 న అరెస్టు చేశారు. డ్రగ్స్‌ పెడ్లర్‌ మహ్మద్‌ అనూప్‌ని బినీష్‌ అదేరోజు బెంగుళూరులో కలుసుకున్నాడు. దాంతో రెండు కేసులకు సంబంధముందా అనే కోణంలో ఎన్‌సీబీ విచారిస్తోంది.  
(చదవండి: యడియూరప్ప ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం)

మరిన్ని వార్తలు