ఆర్డర్‌ చేసిన ఫుడ్‌లో పాము చర్మం...షాక్‌లో కస్టమర్‌

9 May, 2022 15:15 IST|Sakshi

Snake skin found in food: ఇటీవల కోవిడ్‌ -19 తర్వాత ప్రజలు నేరుగా రెస్టారెంట్‌కి వెళ్లి తినడాని కంటే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకుని తినడానికే ఇష్టపడుతున్నారు. అదీగాక జోమాటో, స్వీగ్గీ వంటి ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యూప్‌లు ప్రజలకు వెసులుబాటు కలిగించేలా మంచి డిస్కోంట్‌లు ఇ‍చ్చి మరీ సేవలందింస్తుంది.

వీకెండ్‌ సమయాల్లో మరింత ఆకర్షీణీయమైన పుడ్‌ ఆఫర్లతో భోజనప్రియులకు మరింత చేరువవుతోంది. దీంతో ప్రజలు కూడా ఆన్‌లైన్‌లో ఫుడ్‌ని ఆర్డర్‌ చేసుకుని తినడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే వారికి ఊహించని భయంకరమైన చేదు అనుభవం ఎదురైంది. అంతేకాదు ఆ ఘటన మళ్లీ ఇంకెప్పుడు ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్‌ చేసి తినడానికి జంకేలా చేసింది. 

వివరాల్లోకెళ్తే...కేరళలోని తిరువనంతపురంలో ప్రియా అనే ఒక మహిళ నెడుమంగడు ప్రాంతంలోని ఒక రెస్టారెంట్‌ నుంచి రెండు పరోటాలను ఆర్డర్‌ చేసింది. పైగా ఆర్డర్‌ కూడా సకాలంలోనే డెలివరీ అయింది. ఐతే ఆమె మొదటగా తమ కుమార్తెకు పరోటా పెట్టింది. కానీ ఆ తర్వాత ఆ పరోటా పార్మిల్‌ని ఫ్యాకింగ్‌ చేసిన కవర్‌ మీద సుమారు అరవేలు పొడవు అంతా పాము చర్శం చూసి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

దీంతో ఆమె ఆగ్రహం చెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐతే సదరు రెస్టారెంట్‌ ఆహారాన్ని ప్యాకింగ్‌ చేసిన పేపర్‌ పై పాము చర్మం ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఫుడ్‌ సేఫ్టీ అధికారి అర్షిత బషీర్‌ తెలిపారు. అంతేకాదు వంటగదిలో తగినంత వెలుతురు కూడా లేదని సరైన పరిశుభ్రత పాటించకుండా ఆహారం తయారు చేసున్నారని అన్నారు. సదరు రెస్టారెంట్‌ లైసెన్స్‌ రద్దు చేయడం తోపాటు ఆ రెస్టారెంట్‌ యజమానికి షాకాజ్‌ నోటీసులు కూడా పంపించినట్లు వెల్లడించారు.

(చదవండినిమ్మకాయలతో మామూలుగా ఉండదు.. జైలు అధికారి సస్పెండ్‌!)

మరిన్ని వార్తలు