Hatsoff Doctors వాగులు దాటారు, కొండలు ఎక్కారు

26 May, 2021 16:39 IST|Sakshi

కేరళలో అరుదైన గిరిజన తెగలకు సోకిన కరోనా

అంకిత భావం ప్రదర్శించిన వైద్య బృందం

వైద్యుల శ్రమకు అభినందనల వెల్లువ

పాలక్కాడ్‌: కరోనా కష్టకాలంలో డాక్టర్లలతో పాటు వైద్య సిబ్బంది నిర్విరామంగా శ్రమిస్తున్నారు. తమ  ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. తాజాగా కొండకోనల్లో నివసించే ట్రైబల్స్‌ని కాపాడేందుకు కేరళ వైద్యులు చేసిన ప్రయత్నానికి దేశ ప్రజానీకం హ్యట్సాప్‌ అంటోంది. వారి శ్రమకు దేశవ్యాప్తంగా అభినందనల వెల్లువ కురుస్తోంది. 

మారుమూల గ్రామం
కేరళలోని పాలక్కాడ్‌ జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువ. ఎన్నో గిరిజన తెగలు ఆ అడవుల్లో నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. సరైన రహాదారి, కనీస సౌకర్యాలు లేకపోయినా అడవి తల్లినే నమ్మకుని జీవిస్తున్నారు. అయితే ఇటీవల అట్టపడి టౌన్‌కి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న మురుగుల గ్రామస్తులు కరోనాతో బాధపడుతున్నట్టు స్థానిక వైద్యులకు సమాచారం అందింది. 


 
శ్రమించిన వైద్యులు
మురుగులలో కరోన ఆనవాళ్లు ఉన్నట్టు తెలియగానే స్థానిక వైద్యులు సుకన్య, సునిల్‌ వాసు, శైజిలతో పాటు ఇతర వైద్య సిబ్బంది అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వాహనంలో కొంత దూరం వెళ్లగానే వారికి భవానిపూల నది ఎదురైంది. అక్కడి ఉంచి వాహనంలో పోవడం సాధ్యం కాకపోవడంతో నదిలోనే నడుములోతు నీళ్లలో డాక్టర్ల బృందం ప్రయాణం మొదలైంది. నది దాటిన తర్వాత 8 కిలోమీటర్ల దూరం కొండ అంచున ప్రయాణిస్తూ మురుగుల గ్రామం చేరుకున్నారు.

7గురికి పాజిటివ్‌
మురుగులలో వందమందికి పైగా కురుంభ, ఇరుల, ముదుగర్‌ తెగకు చెందిన జనాభా ఉండగా 30 మందిలో కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. వారికి యాంటిజెన్‌ టెస్టులు అక్కడికక్కడే నిర్వహించగా ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంటనే వారందరినీ ఆస్పత్రికి తరలించారు. 

అభినందనలు
వైద్యులు సకాలంలో స్పందించి ఆ మారుమూల అటవీ గ్రామానికి చేరుకోక పోయి ఉండి ఉంటే ... అరుదైన తెగకు చెందిన ప్రజలు కరోనా బారిన పడి ఉండేవారు. తమ విధుల పట్ల వైద్యులు చూపిన అంకిత భావానికి దేశ నలుమూలల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు