Kerala Floods: విషాదం: మూడు తరాలను మింగేసిన వరద

19 Oct, 2021 09:19 IST|Sakshi
వరదల కారణంగా మృతి చెందిన మార్టిన్‌ కుటుంబ సభ్యులు (ఫైల్‌ఫోటో)

కేరళలో చోటు చేసుకున్న సంఘటన

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి

తిరువనంతపురం: కేరళలో కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. కొట్టాయం, ఇడుక్కి వంటి జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, వరద కారణంగా కేరళ వ్యాప్తంగా 23 మంది మరణించినట్లు ప్రభుత్వ ప్రకటించింది.  భారీ వర్షం కొట్టాయం జిల్లాలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల మనుషుల్ని మింగేసింది. వరదలో ఆరుగురు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

కొట్టాయం జిల్లాకు చెందిన కావాలి ప్రాంతంలో మార్టిన్‌ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తుండేవాడు. మార్టిన్‌కు భార్య, ముగ్గరు పిల్లలు. మార్టిన్‌ అమ్మ కూడా వారితో పాటే ఉండేది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొట్టాయం ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. పైగా భారీ వరద పొటేత్తింది. 
(చదవండి: వరద బీభత్సం.. నెమ్మదిగా మింగేసింది)

ఈ క్రమంలో మార్టిన్‌ ఇల్లు వరదలో కొట్టుకుపోయింది. ఈ సంఘటనలో మార్టిన్‌ కుటుంబ సభ్యులంతా మృతి చెందారు. విషయం తెలుసుకున్న సహాయక సిబ్బంది వారి మృతదేహాలను గుర్తించి బయటకు తీసుకువచ్చారు. వీరికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మూడు తరాల మనుషులను వరద మింగేసింది అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు మార్టిన్‌ బంధువులు, ఇరుగుపొరుగువారు. 

చదవండి: క‘న్నీటి’ రాత్రి: ఏడాది గడిచినా మానని గాయాలు

మరిన్ని వార్తలు