డ్ర‌గ్స్ దందాకు కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్‌కు లింక్!

7 Sep, 2020 14:48 IST|Sakshi

సాక్షి బెంగళూరు: కన్నడనాట డ్రగ్స్‌ మాఫియా వ్యవహారం కలకలం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ డ్ర‌గ్ దందాకు కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్‌కి లింక్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) లోని ఓ సీనియ‌ర్ అధికారి వెల్ల‌డించారు. బెంగుళూరు మాద‌క‌ద్ర‌వ్యాల కేసులో కీల‌క  నిందితుడు డ్రగ్‌ పెడ్లర్‌ మహ్మద్‌ అనూప్, కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసులో నిందితుడు  కె టి రమీస్‌తో మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌లే ఇందుకు కార‌ణంగా క‌నిపిస్తుంది. ఇద్ద‌రి మధ్య నిత్యం  సంప్ర‌దింపులు జ‌రిగాయ‌ని అధికారి పేర్కొన్నారు. మొద‌టినుంచి ఈ రెండు కేసుల‌కి మ‌ధ్య సంబంధాలున్నాయ‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే తాజాగా నిందితుల మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌లు అనుమానాల‌కు మ‌రింత బ‌లం చేకూర్చాయి. ఇప్ప‌టికే ఎన్‌సిబి అధికారులు మ‌హ్మ‌ద్ అనూప్ స‌హా మ‌రో ఇద్ద‌రు నిందితుల‌ను అదుపులోకి  తీసుకున్నారు.  (‘దోషిగా తేలితే నా కొడుక్కి ఉరిశిక్ష వేయండి’)

తాజాగా కేరళ సీపీఎం కార్యదర్శి కుమారుడు, నటుడు బినీష్‌ కొడియేరి పేరు సాండల్‌వుడ్‌ డ్రగ్స్‌ కేసులో తాజాగా బయటపడింది. డ్రగ్‌ పెడ్లర్‌ మహ్మద్‌ అనూప్‌ను ఎన్‌సీబీ అధికారులు  విచారించగా బినీష్‌ పేరు బయటికొచ్చింది. అంతేకాకుండా  కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు నిందితురాలు స్వప్న సురేశ్‌ను బెంగుళూరులో   అరెస్టు చేసిన రోజే  డ్రగ్స్‌ పెడ్లర్‌ మహ్మద్‌ అనూప్‌ని బినీష్‌  బెంగుళూరులో కలుసుకున్నాడు. దాంతో రెండు కేసులకు సంబంధముందా అనే కోణంలో ఎన్‌సీబీ విచారణ‌ను వేగ‌వంతం చేసింది. కాగా త‌న వ్యాపార కార్య‌క‌లాపాల‌కు స‌హాయం చేశాడ‌ని అనూప్ చేసిన వ్యాఖ్య‌ల‌ను బినీష్ కొట్టిప‌రేశాడు. త‌న‌కు ఒక స్నేహితుడిగా మాత్ర‌మే మ‌హ్మ‌ద్ అనూప్ తెలుసున‌ని, డ్ర‌గ్ వ్య‌వ‌హారం గురించి తాన‌కేం తెలియ‌దని, ఇదంతా రాజ‌కీయ కుట్రేన‌ని ఆరోపించాడు.  ఇప్ప‌టికే కన్నడనాట డ్రగ్స్‌ మాఫియా వ్యవహారం కలకలం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. హీరోయిన్‌ రాగిణి ద్వివేది అరెస్టుతో శాండ‌ల్‌వుడ్‌లోని మ‌రికొంత‌మంది న‌టులు, దర్శకులు, నిర్మాతల పేర్లు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. (శాండల్‌వుడ్‌లో డ్రగ్స్‌ కలకలం)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు