ఎక్కడ టచ్‌ చేసినా అత్యాచారమే: కేరళ హైకోర్టు

6 Aug, 2021 11:40 IST|Sakshi

తిరువనంతపురం: అమ్మాయిని పురుషుడి అవయవంతో ఎక్కడ తాకినా అది అత్యాచారం కిందకే వస్తుంది అని కేరళ హైకోర్టు పేర్కొంది. అత్యాచారానికి సంబంధించిన విషయంలో ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పోక్సో చట్టం కింద నమోదైన ఓ లైంగిక దాడి కేసుపై గురువారం కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో కోర్టులో నిందితుడు తాను లైంగిక దాడికి పాల్పడలేదని.. కేవలం తన జననాంగంతో టచ్‌ చేశానని.. అది లైంగిక దాడికి కింద ఎలా వస్తుందని కోర్టుకు తెలిపాడు.

అతడి వాదనను విన్న న్యాయస్థానం విచారణ జరిపింది. అనంతరం అత్యాచారంపై ఓ వివరణ ఇచ్చింది. సెక‌్షన్‌ 375 ప్రకారం.. అమ్మాయి జననాంగాలతో పాటు  ఆమె శరీరంపై పురుషుడి అవయవం ఎక్కడ తాకినా అది అత్యాచారం (రేప్‌) చేసినట్టేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. అనంతరం బాధితురాలి వయసును ఆమె తరఫు న్యాయవాది నిర్ధారించకపోవడంతో ఈ కేసును కొట్టివేసింది. నిందితుడికి మాత్రం జీవిత ఖైదు విధిస్తూ హైకోర్టు  జస్టిస్‌ కె. వినోద్‌ చంద్రన్‌, జస్టిస్‌ జియాద్‌ రహ్మన్‌తో కూడిన బెంచ్‌ తీర్పునిచ్చింది. 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు