పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తే మాల్స్‌కే ప్రమాదం: కేరళ హైకోర్టు

15 Jan, 2022 09:17 IST|Sakshi

పార్కింగ్ రుసుము వసూలు చేసే హక్కు ప్రాథమికంగా మాల్స్‌కు లేదని కేరళ హైకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు పార్కింగ్ ఫీజుల వసూళ్లను నిలిపివేయాలని ఆదేశించటం లేదు కానీ అలా వసూల్‌ చేస్తే మాల్స్‌కే ప్రమాదం అని కేరళ హైకోర్టు న్యాయమూర్తి కున్హి కృష్ణన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు కలమస్సేరి మునిసిపాలిటీ ఎర్నాకులంలోని లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్‌కు ఏదైనా లైసెన్స్ జారీ చేసిందా అని కూడా ప్రశ్నించింది.

"బిల్డింగ్ రూల్స్ ప్రకారం, భవనం నిర్మించడానికి పార్కింగ్ స్థలం కోసం తగినంత స్థలం అవసరం. పార్కింగ్ స్థలం భవనంలో భాగం. పార్కింగ్ స్థలం ఉండాలనే షరతులతో భవన నిర్మాణ అనుమతి జారీ చేయబడుతుంది. కాబట్టి భవనం యజమాని పార్కింగ్ రుసుము వసూలు చేయడం సమంజసం కాదని భావిస్తున్నాం అని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే మాల్స్‌ తమ పూర్తి రిస్క్‌తో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చు అని కోర్టు పేర్కొంది.

ఈ మేరకు వడక్కన్ అనే వ్యక్తి  డిసెంబర్ 2న లులు మాల్‌ను సందర్శించినప్పుడు అతని నుండి పార్కింగ్ ఫీజు రూ. 20  వసూలు చేసినందుకు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పైగా ఆయన తాను డబ్బు చెల్లించేందుకు నిరాకరించడంతో మాల్ సిబ్బంది ఎగ్జిట్ గేట్‌లను మూసివేసి బెదిరించారని కూడా ఆరోపించారు. ఈ మేరకు కోర్టు ఈ సమస్యకు సంబంధించిన వివరణను దాఖలు చేయవల్సిందిగా మున్సిపాలిటీని కోరడమే కాక ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు