పెళ్లికి నిరాకరణ.. యువకుడిపై వివాహిత యాసిడ్‌ దాడి

21 Nov, 2021 12:45 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కేరళలో చోటు చేసుకున్న సంఘటన

Kerala Married Woman Pours Acid On Man For Rejecting To Marriage Her: వివాహం చేసుకోవడానికి నిరాకరించిన వ్యక్తిపై యాసిడ్‌తో దాడి చేసింది ఓ వివాహిత. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. తిరువనంతపురానికి చెందిన అరుణ్‌ కుమార్‌ అనే వ్యక్తికి షీబా అనే మహిళతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అప్పటికే షీబాకు వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో విడిపోయిన షీబా పిల్లలతో కలిసి వేరుగా ఉంటుంది. షీబా వివాహిత అని తెలియని అరుణ్‌ ఆమెతో ప్రేమాయణం నడిపాడు.

ఈ క్రమంలో ఓ రోజు షీబాకు వివాహం అయి.. ఇద్దరు పిల్లలు ఉన్న విషయం అరుణ్‌కు తెలిసింది. దాంతో అతడు తమ బంధానికి ముగింపు పలకాలని భావించాడు. కానీ షీబా అందుకు అంగీకరించలేదు. తనను వివాహం చేసుకోవాల్సిందేనని పట్టుబట్టింది. తమ బంధం గురించి నలుగురికి చెప్తానని బెదిరించి.. అరుణ్‌ కుమార్‌ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయసాగింది.
(చదవండి: మాజీ మిస్‌ కేరళ, రన్నరప్‌ మృతి: ఆడి కారులో వెంటాడి మరీ)

ఈ క్రమంలో నవంబర్‌ 16న అరుణ్‌ కుమార్‌ తన అన్న, మరో స్నేహితుడితో కలిసి... తిరువనంతపురంలో ఉన్న చర్చికి వెళ్లాడు. షీబా అడిగిన మొత్తాన్ని ఆమెకు ఇచ్చాడు. ఆ సమయంలో ఇరువురి మధ్య వివాహం గురించి మరో సారి చర్చకు వచ్చింది. ఈ క్రమంలో అరుణ్‌ కుమార్‌.. షీబాను వివాహం చేసుకోలేనని తేల్చి చెప్పాడు. అరుణ్‌కుమార్‌పై ఆగ్రహంతో ఉన్న షీబా.. చర్చి వద్దకు వచ్చేటప్పుడే తనతో పాటు యాసిడ్‌ తీసుకుని వచ్చింది. 
(చదవండి: నకిలీ ఫేస్‌బుక్‌ క్రియేట్‌ చేసి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌.. ఓకే చేయగానే..)

అరుణ్‌ కుమార్‌ పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్‌ అతడిపై పోసి.. అక్కడ నుంచి పరారయ్యింది. ప్రస్తుతం అరుణ్‌ కుమార్‌కు తిరువనంతపురం మెడికల్‌ కాలేజీ హాస్పటిల్‌లో చికిత్స జరగుతుంది. యాసిడ్‌ దాడిలో అరుణ్‌ కుమార్‌ కంటి చూపు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి.. షీబాను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో షీబాకు కూడా గాయాలయినట్లు పోలీసులు వెల్లడించారు. 

చదవండి: ప్రియురాలి యాసిడ్‌ దాడి, ప్రియుడి మృతి

మరిన్ని వార్తలు