మాజీ మిస్‌ కేరళ, రన్నరప్‌ మృతి: ఆడి కారులో వెంటాడి మరీ

20 Nov, 2021 13:46 IST|Sakshi

పోలీసుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు

తిరువనంతపురం: మాజీ మిస్‌ కేరళ అన్సీ కబీర్‌(25), రన్నరప్‌ అంజనా షాజన్‌(26)ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కావాలనే కొందరు వ్యక్తులు వీరిని ఆడి కారులో వెంబడించినట్లు పోలీసులు గుర్తించారు. కారులో వీరిని వెంబడించిన సైజు థంకచన్‌కు డ్రగ్‌ పెడ్లర్స్‌తో సంబంధాలున్నట్లు విచారణలో తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..

2021, నవంబర్‌ 1న మాజీ మిస్‌ కేరళ అన్సీ కబీర్‌(25), రన్నరప్‌ అంజనాలు ప్రయాణిస్తున్న కారు ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో అన్సీ కబీర్‌, అంజనాలు అక్కడిక్కడే మృతి చెందారు. అయితే చనిపోవాడానికి ముందు వీరు ఫోర్ట్‌ కొచ్చి ప్రాంతంలో ఉన్న హైఎండ్‌ హోటల్‌ నంబర్‌.18లో ఓ పార్టీ హాజరయినట్లు పోలీసులు తెలిపారు. 


(చదవండి: రోడ్డు ప్రమాదంలో మాజీ మిస్‌ కేరళ, రన్నరప్‌ దుర్మరణం)

పార్టీ ముగిసిన తర్వాత మోడల్స్‌ ఇంటికి వెళ్తుండగా.. పార్టీకి వచ్చిన కొందరు అతిథులు మోడల్స్‌ ఇంటికి వెళ్తుండగా ఆడి కారులో వారిని వెంబడించారు. సీసీటీవీ కెమరా ఫుటేజ్‌లో ఆడి కారు మోడల్స్‌ని ఫాలో అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆడి కారు డ్రైవ్‌ చేసిన వ్యక్తి సైజు థంక్‌చన్‌ అని.. అతడికి కొచ్చిలోని డ్రగ్‌ పెడ్లర్స్‌తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి కొచ్చికి మాదక ద్రవ్యాలు తెచ్చే గ్రూప్‌ కోసం సైజు పని చేసేవాడని పోలీసులు తెలిపారు. 

పార్టీ ముగిసిన తర్వాత తనతో రావాల్సిందిగా సైజు మోడల్స్‌ని ఆహ్వానించాడు. కానీ వారు అంగీకరించలేదు. ఈ క్రమంలో సైజు వారిని ఫాలో అయ్యాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగి అంజనా, అన్సీ మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పార్టీ జరిగిన హోటల్‌ హోటల్ యజమాని రాయ్ వాయలత్‌తో పాటు కొందరు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. 


(చదవండి: సుశాంత్‌ సింగ్‌ కుటుంబంలో తీవ్ర విషాదం)

మే 2021లో సైజు ఫోటో జత చేసిన ఇంటెలిజెన్స్ నివేదిక ఒకటి నంబర్ 18 హోటల్‌లో జరిగిన పార్టీలలో డ్రగ్స్ వాడినట్లు తెలుపుతోంది. అయితే, హోటల్ యజమాని రాయ్ వాయలత్‌కు పోలీసులతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఈ కేసు తదుపరి విచారణ ముందుకు సాగలేదు.

చదవండి: ఆడి కారు యాక్సిడెంట్‌: ఎన్నో అనుమానాలు.. అసలు ఏం జరిగింది? 

మరిన్ని వార్తలు