గవర్నర్‌కు వర్సిటీల చాన్స్‌లర్‌ హోదా రద్దు

14 Dec, 2022 07:57 IST|Sakshi

తిరువనంతపురం: రాష్ట్రంలోని వర్సిటీలకు చాన్సెలర్‌గా గవర్నర్‌ను తొలగించడంతోపాటు ఆ హోదాలో ప్రముఖ విద్యావేత్తను నియమించేందుకు ఉద్దేశించిన బిల్లును కేరళ అసెంబ్లీ మంగళవారం ఆమోదించింది. అయితే, తమ ప్రతిపాదనలను బిల్లులో చేర్చలేదంటూ కాంగ్రెస్‌ సారథ్యంలోని ప్రతిపక్ష యూడీఎఫ్‌ సభ నుంచి వాకౌట్‌ చేసింది.

కేరళ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిని గానీ, సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జీలను గానీ చాన్సలర్‌గా నియమించాలని యూడీఎఫ్‌ సూచించింది. చాన్సెలర్‌ ఎంపిక కమిటీలో సీఎం, ప్రతిపక్ష నేత, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలంది. 

ఇదీ చదవండి: పేరెంట్స్‌ మీటింగ్‌కి బాయ్‌ఫ్రెండ్‌.. బిత్తరపోయిన ఉపాధ్యాయులు

మరిన్ని వార్తలు