వీడియో: కానిస్టేబుల్‌ కక్కుర్తి.. అటు ఇటు చూసి మామిడి పండ్ల దొంగతనం.. అడ్డంగా బుక్కయ్యాడు

5 Oct, 2022 19:06 IST|Sakshi

కొట్టాయం: కక్కుర్తితో ఎవరూ లేని టైంలో ఓ దుకాణం బయటి నుంచి మామిడి పండ్లను కాజేసిన దొంగను.. పోలీసుగా గుర్తించారు కేరళ అధికారులు. కొట్టాయం కంజిరాపల్లి సెప్టెంబర్‌ 28న ఓ రోడ్‌ సైడ్‌ దుకాణం దగ్గర ఈ దొంగతనం జరిగింది. 

ఇడుక్కి ఏఆర్‌ క్యాంప్‌లో పని చేసే పీవీ షిహాబ్‌.. ఓ మామిడి పండ్ల దుకాణం ముందు ఈ చోరీకి పాల్పడ్డాడు. ఎవరూ లేనిది చూసి సుమారు పది కేజీల మామిడి పండ్లను బైక్‌ ద్వారా తరలించాడతను. అయితే.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ చోరీని గుర్తించాడు ఆ దుకాణం యాజమాని. దొంగ హెల్మెట్‌, రెయిన్‌కోట్‌ ధరించి ఉండడంతో.. తొలుత అతన్ని గుర్తించడం వీలుకాలేదు. అయితే బైక్‌ నెంబర్‌ ఆధారంగా.. అతను షిహాబ్‌గా గుర్తించారు. 

దీంతో డిపార్ట్‌మెంట్‌ పరువు తీసినందుకు అతన్ని సస్పెండ్‌ చేశారు ఉన్నతాధికారులు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా.. అధికారులు గాలింపు చేపట్టారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్న టైంలోనే ఈ పండ్ల చోరీకి పాల్పడినట్లు అతను పాల్పడినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు