తల్లిపాలకు దూరమై సొమ్మసిల్లిన బిడ్డ.. పాలిచ్చి కాపాడిన రమ్య

31 Oct, 2022 21:22 IST|Sakshi

ఆకలితో అలమటిస్తున్న పసికందుకు పాలిచ్చి రక్షించినందుకు పోలీసు అధికారిణిని హైకోర్టు న్యాయమూర్తితో సహా పలువురు అధికారులు ప్రశసించారు. ఈ ఘటన కోజికోడ్‌ చెవాయూర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కోజికోడ్‌ చెవాయూర్‌ పోలీస్టేషన్‌లో సివిల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా ఎంఆర్‌ రమ్య విధులు నిర్వర్తిస్తున్నారు. శనివారం ఉదయం 22 ఏళ్ల మహిళ తన నవజాత శిశువు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. కుటుంబ కలహాల కారణంగా పసికందుని తల్లి వద్ద నుంచి ఎత్తుకెళ్లి ఉండవచ్చిన అనుమానించి.. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు.

పని నిమిత్తం బెంగుళూరు వెళ్లిన తండ్రితోనే ఆ పసికందు ఉండవచ్చనే అనుమానంతో వాయనాడ్‌ సరిహద్దులోని పోలీస్టేషన్లకు సమాచారం అందించారు. దీంతో సుల్తాన్‌బతేరి పోలీసులు సరిహద్దు వెంబడి వాహనాలను తనిఖీ చేస్తుండగా శిశువుతో ఉన్న తండ్రిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని వద్ద ఉన్న శిశువు ఆకలితో అలమటించి సొమ్మసిల్లింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ఐతే బిడ్డ షుగర్‌ లెవెల్స్‌ పడిపోయినట్లు  వైద్యులు గుర్తించారు. ఆస్పత్రికి చేరు పోలీస్‌ అధికారి రమ్య తాను పాలిచ్చే తల్లినని చెప్పి వెంటనే ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకుని పాలిచ్చారు. ఆ తర్వాత ఆ శిశువును తల్లి ఒడికి చేర్చారు. ఆ సమయంలో ఆమె చూపించిన ఉదార సేవకు ముగ్ధుడై హైకోర్టు న్యాయమూర్తి దేవన్‌ రామచంద్రన్‌ ఆమె చేసిన పనిని మెచ్చుకుంటూ పోలీసు ఉన్నతాధికారులకు లేఖ కూడా రాశారు.

ఈ మేరకు పోలీస్‌ అధికారి రమ్యకు జడ్జి సర్టిఫికేట్‌ను పోలీస్‌ చీఫ్‌  అనిల్‌ అందించడమే ఆమె కుటుంబసభ్యులను పోలీసు ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించి ప్రశంసా పత్రంతో సత్కరించారు. అంతేకాదు ఆకలితో అలమటించిన పసికందు పట్ల సానుభూతితో రమ్య వ్యవహరించిన తీనే పోలీసు శాఖ ప్రతిష్టను పెంచిందని  ఉన్నతాధికారులు అన్నారు. 

(చదవండి: చాక్లెట్ల దొంగతనం వైరల్‌ కావడంతో... విద్యార్థిని ఆత్మహత్య)
 

మరిన్ని వార్తలు