Shigella Infection: కేరళలో మరోసారి షిగెల్లా కేసు.. ప్రాథమిక లక్షణాలు ఇవే!

28 Apr, 2022 19:15 IST|Sakshi

తిరువనంతపురం: కేరళలో మరోసారి షిగెల్లా కేసు వెలుగుచూసింది. కోజికోడ్‌లోని పుత్తియప్పలో ఏడేళ్ల బాలికలో ఈ వ్యాధిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 27నే కేసు నమోదైందని, ఇంకా ఎవరికీ వ్యాపించలేదని పేర్కొన్నారు. ఏప్రిల్ 20న బాలికలో షిగెల్లా లక్షణాలు కనిపించాయని, పొరుగింట్లోని మరో చిన్నారిలోనూ వ్యాధి లక్షణాలున్నాయని చెప్పారు. 

ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందన్నారు. షిగెల్లా అనే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఇది ఒకరినుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుంది. జ్వరం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట మొదలైనవి షిగెల్లా వ్యాధి ప్రాథమిక లక్షణాలు. ఐదేళ్లలోపు పిల్లలకు ఈ వ్యాధి సంక్రమిస్తే ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
చదవండి👇🏿
భానుడి భగభగలతో బతకలేం బాబోయ్! ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ
విద్యార్థులకు ఫ్రీ హెయిర్‌ కటింగ్‌ చేయించిన టీచర్లు.. అసలు మ్యాటర్‌ ఏంటంటే!

మరిన్ని వార్తలు