విషాదం: బావిలో దిగి ఊపిరాడక నలుగురు మృతి

15 Jul, 2021 21:16 IST|Sakshi

తిరువనంతపురం: తాము చేయబోయే పనే వాళ్లను మృత్యుఒడిలోకి తీసుకెళ్తుందని గ్రహించలేక నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొల్లాం జిల్లాలోని కోవిల్‌ముక్కు సమీపాన గురువారం ఉదయం బావిలోకి సిల్ట్‌ను తొలగించే పనిలో భాగంగా నలుగురు కార్మికులు అందులోకి దిగారు. బావి లోతుకు వెళ్లడం కారణంగా అందులో సరిగా ఊపిరాడకపోవడంతో పాటు విషవాయువు వెలువడింది.

ఈ క్రమంలో ఆ నలుగురికి ఊపిరి పీల్చుకోవడంతో ఇబ్బందులు రావడం, కాసేపటికే వారు గాలి అందక కొట్టుమిట్టాడుతూ మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, రెస్క్యూ టీం ఆ  బావిలో ఉన్న నలుగురిని బయటకు వెలికి తీశారు. రెస్క్యూ టీం వారిని వాళ్లను బావిలోంచి బయటకు తీసే సమయంలో అందులోని ఓ సభ్యుడు సైతం సంఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే  ఆ వ్యక్తిని అధికారులు ఆస్పత్రిలో చేర్పించారు.

మృతులు సోమరాజన్ (54), రాజన్ (35), మనోజ్ (32), శివప్రసాద్ (24)గా గుర్తించారు. మృతదేహాలను బావిలో నుంచి వెలికితీసి కొల్లం జిల్లా ఆసుప్రతికి తరలించారు. కాగా ఈ సంఘటన తర్వాత ఆ బావిని మూసివేయాలని అధికారులు తెలిపారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు