పొట్ట కొట్టారు..ట్రాన్స్‌జెండర్‌ మహిళ కంటతడి

14 Oct, 2020 15:28 IST|Sakshi

కొచ్చి : సమాజంలో తమపట్ల ఉన్న చెడు అభిప్రాయాన్ని తుడిచేయాలకుంది ఆ ట్రాన్స్‌జెండర్‌ మహిళ. అందరిలా గౌరవంగా బతకాలనుకున్నారు. సొంతకాళ్లపై నిలబడాలనుకున్నారు. బ్యాంకుల్లో లోన్‌ తీసుకొని బిర్యానీ సెంటర్‌ పెట్టుకున్నారు. ఇతర షాపుల కంటే తక్కువ ధరకు క్వాలిటీ బిర్యానీని అందజేశారు. దీంతో ఆమె గిరాకీ రోజు రోజుకి పెరిగిపోయింది. అయితే ఇది గిట్టని చుట్టుపక్కల వ్యాపారస్తులు ఆమె మీద లేని పోని రూమర్లు సృష్టించారు. ఆమెకు వస్తున్న గిరాకి దెబ్బదీశారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది.

కొచ్చికి చెందిన  ట్రాన్స్‌జెండర్‌ ఉమన్ సజన షాజీ బిర్యానీ సెంటర్‌ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా పని దొరక్క ఇబ్బంది పడుతున్న మరో నలుగురు ట్రాన్స్‌జెండర్‌ మహిళలకు కూడా ఆమె ఉపాధి కల్పిస్తున్నారు. ఇతరుల కంటే తక్కువ ధరకు క్వాలిటీపుడ్‌ అందిస్తున్నారు. ఇది గిట్టని పక్క షాపు వాళ్లు ఆమెపై రూమర్లు సృష్టించారు. ఆమె సరఫరా చేసే బిర్యానీ క్వాలిటీది కాదని పుకారు రేపారు. దీంతో ఆమె గిరాకీ దెబ్బతింది. తనతో పాటు మరో నలుగురి ట్రాన్స్‌జెండర్‌ మహిళలకు ఉపాధి దొరుకుతుందని బిర్యానీ సెంటర్‌ పెడితే.. కావాలనే కొంతమంది తన గిరాకీ దెబ్బతీస్తున్నారని షాజీ మండిపడ్డారు. సోషల్‌ మీడియా వేదికగా తన ఆవేదనను చెప్పుకుంటా భోరున విలపించారు. తన షాపుకు ఎదురుగా ఉన్న చెపల వ్యాపారీ గిరీష్‌ వల్లే తన గిరాకీ దెబ్బతిందని ఆరోపించారు.

తమ బిర్యానీ సెంటర్‌కు వచ్చే కస్టమర్లకు అబద్దాలు చెప్పి గిరాకీ పాడు చేస్తున్నారని తన గోడును విన్నవించారు. మొదట్లో తమ షాపులో 300 బిర్యానీ ప్యాకెట్ల వరకు అమ్ముడుపోయేవని, కొద్దిరోజుల తర్వాత అవి 150కి పడిపోయాయని, ఇప్పుడైతే 20 ప్యాకెట్లు కూడా సేల్స్‌ కావడంలేదని ఆవేదన వ్యక్త చేశారు.‘రైళ్లలో యాచించడం, రాత్రిపూట వీధుల్లో తిరిగే బదులు పని చేసుకొని మంచి జీవితాన్ని గడపమని ప్రజలు చెబుతుంటారు. సమాజం మర్యాదగా పనిచేయడానికి అనుమతించకపోతే, మేము ఏం చేయాలని’అని షాజీ భోరున విలపించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా