దర్భంగా పేలుళ్ల విచారణ... కీలక అంశాలు వెలుగులోకి

20 Aug, 2021 10:27 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌: దర్భంగా పేలుడు ఘటనపై జరుగుతున్న విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. దర్భంగా పేలుడు సూత్రధారులకు హవాలా రూపంలో డబ్బులు అందినట్లు తెలిసింది. పేళుళ్లలో ప్రధాన సూత్రధారులైన మాలిక్‌ సోదరులకు హాజీ సలీం హవాలా రూపంలో డబ్బులు అందించినట్లు సమాచారం. పదేళ్ల క్రితం పాకిస్తాన్‌లో ఇక్బాల్‌ ఖానాని నాసిర్‌, మాలిక్‌ కలిశారు.

ఆ సమయంలోనే నాసిర్‌, మాలిక్‌లు కెమికల్‌ బాంబుల తయారీ విధానాన్ని నేర్చుకున్నారు. ఆ తర్వాత సొంత జిల్లా కైరానాలో హాజీ సలీంతో కలిసి పేలుళ్లకు కుట్ర పన్నారు. దీని కోసమే నాసిర్‌, మాలిక్‌లకు హవాలా రూపంలో డబ్బులు సరఫరా జరిగింది. హాజీ పంపిన డబ్బులతోనే నాసిర్‌, మాలిక్‌లు కెమికల్‌ బ్లాస్ట్‌కు ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు లష్కరే తొయిబా ఉగ్రవాది ఇక్బాల్‌ పాక్‌లోనే ఉండి పెద్ద ఎత్తున్న బ్లాస్ట్‌లకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఈ బ్లాస్టింగ్స్‌ కోసం లష్కరే తొయిబా ఆర్థిక కష్టాల్లో ఉన్నవారిని ఎంపిక చేసింది.

మరిన్ని వార్తలు