ఉర్దూస్తాన్, ఖలిస్తాన్‌..

26 Sep, 2023 05:29 IST|Sakshi

మతాల ప్రాతిపదికన భారత్‌ను విచ్ఛిన్నం చేసే కుట్ర

ఖలిస్తాన్‌ ఉగ్రసంస్థ చీఫ్‌ పన్నాగం

భారత నిఘా నివేదికలో విస్మయకర విషయాలు

న్యూఢిల్లీ: భారత్‌లో ప్రత్యేక ఖలిస్తాన్‌ కోసం వేర్పాటువాదం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌(ఎస్‌ఎఫ్‌జే) ఉగ్రసంస్థ చీఫ్‌ గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ పెద్ద ప్రణాళికలే రచించాడు. సంబంధిత వివరాలు ఉన్న భారత నిఘా వర్గాల నివేదిక ఈ విషయాలను వెల్లడిస్తోంది. ఆ నివేదికలోని వివరాలను ఓసారి గమనిస్తే
► మతాల ప్రాతిపదికన భారత్‌ను విడగొట్టాలి అనేది పన్నూ ప్రధాన ఎజెండా.
► ఢిల్లీ, పంజాబ్, హిమాచల్‌ ప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్‌సహా పలు రాష్ట్రాల్లో పన్నూపై పలు కేసులు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్న పన్నూపై భారత్‌లో చాలా రాష్ట్రాల్లో పదహారుకు పైగా కేసులు నమోదవడాన్ని బట్టి ఎస్‌ఎఫ్‌జే కార్యకలాపాలు ఇండియాలో ఎంతగా విస్తరించాయో అర్ధమవుతుంది.
► భారత భూభాగంలో ముస్లింల కోసం ప్రత్యేక దేశాన్ని ఏర్పాటుచేయాలనేది పన్నూ ఆలోచన. దీనికి ‘ డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ఉర్దూస్తాన్‌’ అని పేరు కూడా ఖాయం చేసుకున్నాడు.
► దేశం నుంచి కశీ్మర్‌ను వేరుచేసేందుకు కశ్మీర్‌లోని ప్రజలను విప్లవకారులుగా తయారుచేయాలని కంకణం కట్టుకున్నాడు. అందుకోసం భారత్‌ పట్ల వ్యతిరేకభావన ఉన్న ప్రాంతాల్లో విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. కశీ్మర్‌లో అసంతృప్తితో రగిలిపోతున్న వారికి మరింత ఉద్రేకపరిచేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఖలిస్తాన్‌ జెండా ఎగరేస్తానని పన్నూ గతంలో ప్రకటించాడు కూడా.

అసలు ఎవరీ పన్నూ ?
దేశ విభజన కాలంలో 1947లో పన్నూ కుటుంబం పాకిస్తాన్‌ నుంచి అమృత్‌సర్‌ దగ్గర్లోని ఖాన్‌కోట్‌ గ్రామానికి వలసవచి్చంది. అమృత్‌సర్‌లో పుట్టిన పన్నూ.. పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి లా పట్టా పుచ్చుకున్నాడు. అమెరికాలో ఉంటున్న పన్నూ అక్కడే అటారీ్నగా పనిచేస్తున్నాడు. భారత్‌లో ఖలిస్తాన్‌ను ఏర్పాటుకు కృషిచేస్తున్న ఎస్‌ఎఫ్‌జే సంస్థకు న్యాయ సలహాదారుగా ఉంటున్నట్లు పన్నూ చెప్పుకుంటున్నాడు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సాక్ష్యాధారాలతో గుర్తించిన కేంద్ర హోం శాఖ పన్నూను ఉగ్రవాదిగా ప్రకటించింది.  

పన్నూ ప్రేలాపణలు..
భారత్‌లో ఖలిస్తాన్‌ వేర్పాటువాదంలో నిమగ్నమైన వారికి నగదు ప్రోత్సాహకాలు ఇస్తుంటాడని పన్నూపై ఆరోపణలు ఉన్నాయి. తాను చెప్పిన పనులు చేసినా భారీ బహుమతులు ఇస్తానని గతంలో బహిరంగ ప్రకటనలుచేశాడు. ఢిల్లీలోని ప్రఖ్యా త ఇండియాగేట్‌ వద్ద ఖలిస్తాన్‌ జెండా ఎగరేస్తే 25 లక్షల డాలర్లు ఇస్తానని పిలుపునిచ్చాడు. 2021లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని మోదీ మువ్వన్నెల జెండా ఎగరేయకుండా ఎవరైనా పోలీసు అడ్డుకుంటే అతనికి 10 లక్షల డాలర్లు ఇస్తానని ప్రకటించాడు. భారత వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిన పన్నూపై ఎన్‌ఐఏ కోర్టు 2021 ఫిబ్రవరిలో నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీచేసింది.

మరిన్ని వార్తలు