ఖరీఫ్‌ వరి సేకరణ లక్ష్యం 5.18 కోట్ల మెట్రిక్‌ టన్నులు

22 Sep, 2022 11:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ సీజన్‌లో 5.18 కోట్ల మెట్రిక్‌ టన్నుల మేర సేకరణ చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. గతేడాది సేకరించిన 5.09 కోట్ల టన్నుల కంటే ఇది కాస్త ఎక్కువ. వాస్తవానికి ప్రస్తుత సీజన్‌లో జూన్‌లో రుతుపవనాల మందగమనం, జూలైలో అసమాన వర్షాల నేపథ్యంలో వరి సాగు తగ్గింది.

సాగు తగ్గిన ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఆగస్టు నెల నుంచి వరినాట్లు పుంజుకోవడంతో దేశవ్యాప్తంగా 3.67 కోట్ల హెక్టార్లలో సాగు జరిగింది. ఇది గత ఏడాది సాగు కన్నా 5.5 శాతం తక్కువగా ఉంది. దిగుబడిలో తగ్గుదల ఉండదని, ఏటా పెరుగుతున్న సగటు సేకరణ దృష్ట్యా ఈ సీజన్‌లో గత ఏడాది కన్నా కాస్త ఎక్కువే ఉంటుందని కేంద్రం అంచనా వేసింది.

ఇదీ చదవండి: ఇదెక్కడి గొడవ.. కారు ఢీకొని గాల్లోకి ఎగిరిపడ్డా తగ్గేదేలే..!

మరిన్ని వార్తలు