8 ఏళ్లప్పుడు మా నాన్న లైంగికంగా వేధించాడు

7 Mar, 2023 01:53 IST|Sakshi

ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలు ఖుష్బూ సుందర్‌

చెన్నై/జైపూర్‌: నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ సుందర్‌ సంచలన విషయాలు వెల్లడించారు. ఎనిమిదేళ్ల వయస్సులో తన తండ్రే తనను లైంగికంగా వేధించారని చెప్పారు! ‘మోజో స్టోరీ’ డిజిటల్‌ వార్తా చానల్‌ ఇటీవల జైపూర్‌లో నిర్వహించిన ‘వుయ్‌ ది విమెన్‌’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘మా నాన్న వల్ల అమ్మ జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంది. అమ్మను, నన్ను కొట్టేవాడు.

లైంగికంగా వేధించేవాడు. ఒక మగవాడిగా దాన్ని జన్మహక్కుగా భావించేవాడు. నాకు 8 ఏళ్లప్పుడే లైంగికంగా వేధించాడు. 15 ఏళ్ల వయస్సులో ఆయన్ను ఎదిరించే ధైర్యం వచ్చింది. ఆపైన ఉన్నవన్నీ తీసేసుకుని మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు’ అని గుర్తు చేసుక్నున్నారు. బాల్యంలో లైంగిక వేధింపులకు గురైతే అది వారిని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని ఆవేదన వెలిబుచ్చారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు