అమితాబ్‌ వ్యాఖ్యలపై.. బీజేపీ, టీఎంసీ వాగ్యుద్ధం

17 Dec, 2022 07:58 IST|Sakshi

కోల్‌కతా: భావప్రకటన స్వేచ్ఛపై బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ చేసిన వ్యాఖ్యలు బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ మధ్య మాటల మంటలు రేపాయి. గురువారం కోల్‌కతాలో అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, నటుడు షారూక్‌ ఖాన్‌ సమక్షంలో అమితాబ్‌ మాట్లాడుతూ పౌర హక్కులు, భావప్రకటన స్వేచ్ఛపై ఇంకా ప్రశ్నలు తలెత్తుతున్నాయన్నారు.

ఆ వ్యాఖ్యలు మమత నిరంకుశ ధోరణికి  అద్దం పట్టేలా ఉన్నాయంటూ బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ విమర్శించారు. టీఎంసీ ఎంపీ, నటి నస్రత్‌ జహాన్‌ వాటిని ఖండించారు. బీజేపీ పాలనతో నిజంపై అన్ని రంగాల్లోనూ నిర్బంధం కొనసాగుతోందని ఆరోపించారు.

ఇదీ చదవండి: కేంద్రం మొద్దు నిద్ర: రాహుల్‌

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు