భారతీయుల కిడ్నాప్‌.. కిరణ్‌ రిజిజు స్పందన

8 Sep, 2020 19:00 IST|Sakshi

న్యూఢిల్లీ: గత వారం అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన ఐదుగురు భారత పౌరులు తమ వైపు ఉన్నట్లు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) ధృవీకరించిందని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. వారిని భారత్‌కు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. ‘భారత సైన్యం పంపిన హాట్‌లైన్ సందేశానికి చైనా పీఎల్‌ఏ స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి తప్పిపోయిన యువకులు వారి పక్షాన ఉన్నట్లు చైనా ధ్రువీకరించింది. వారిని భారత్‌కు అ‍ప్పగించే ప్రక్రియకు సంబంధించిన చర్యలు కొనసాగుతున్నాయి’ అని ట్వీట్‌ చేశారు. (చదవండి: ఇప్పుడే చెప్పలేం)

అరుణాచల్ ప్రదేశ్ ఎగువ సుబన్సిరి జిల్లా నుంచి శుక్రవారం తప్పిపోయిన ఐదుగురు పౌరులు భారత సైన్యానికి పోర్టర్లు, గైడ్లుగా పనిచేస్తున్నారు. మొత్తం ఏడుగురు అదృశ్యం కాగా వారిలో ఇద్దరు తప్పించుకుని వచ్చి సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒకరు దీని గురించి ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు