అగ్నిపథ్‌పై నిరసనలు: కిషన్‌రెడ్డి కామెంట్స్‌ ఇవే..

17 Jun, 2022 14:56 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘అగ్నిపథ్‌’పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ‘అగ్నిపథ్‌’ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. శుక్రవారం ఉదయం ఉన్నట్లుండి నిరసనకారులు ప్లాట్‌ఫామ్‌లపైకి చేరి.. విధ్వంసం మొదలుపెట్టారు. సుమారు ఐదు వేల మంది ఆందోళనకారులు సికింద్రాబాద్‌కు పోటెత్తడంతో.. ఏం చేయాలో పాలుపోని స్థితికి పోలీసులు చేరుకున్నారు. ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్పందించారు. కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అ‍గ్నిపథ్‌ వంటి పథకాలు దేశంలో చాలా ఉన్నాయి. అగ్నిపథ్‌ విషయంలో యువతను తప్పుదారి పట్టించడం మంచిది కాదు. సికింద్రాబాద్‌ ఘటన పథకం ప్రకారమే కుట్రచేసి విధ్వంసం సృష్టించారు. ఇది బలవంతపు ట్రైనింగ్‌ కాదు, స్వచ్చందంగా సైన్యంలో చేరవచ్చు. జాతీయభావం తీసుకురావడంతో భాగంగా అగ్నిపథ్‌ను తీసుకువచ్చాము.

ప్రజలు, యువతలో దేశభక్తి, నైపుణ్యం పెంచే ప్రయత్నమే ఇదే. అగ్నిపథ్‌ యువతకు వ్యతిరేకం కాదు. కుట్రపూరితంగానే అగ్నిపథ్‌పై ప్రచారం జరుగుతోంది. అగ్నిపథ్‌లో చేరడం యువకులకు అదనపు అర్హత. కొందరు కావాలని విధ్వంసం సృష్టించాలని సూచిస్తున్నారు. విధ్వంసం సృష్టిస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. రైల్వే కోచ్‌లు తగలబెడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. రైల్వే స్టేషన్‌ను టార్గెట్‌ చేసి దాడి చేశారు. 6 గంటల పాటు రైల్వే స్టేషన్‌లో అలజడి సృష్టించారు. బైకులు, రైల్వే ప్రాపర్టీ, స్టాల్స్‌ను తగులబెట్టారు. శాంతిభద్రతల బాధత్య రాష్ట‍్ర ప్రభుత్వానిదే. RPF లా అండ్‌ ఆర్డర్‌ చూడదు అంటూ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: సికింద్రాబాద్‌ ‘అగ్నిపథ్‌’ ఆందోళనలు హింసాత్మకం

మరిన్ని వార్తలు