వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం: కిషన్‌రెడ్డి

15 May, 2021 12:14 IST|Sakshi

డిసెంబర్‌ నాటికి 15 కోట్ల 50 లక్షల డోసుల ఉత్పత్తి 

కరోనా కట్టడికి కేంద్రం చర్యలు

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 

సాక్షి, ఢిల్లీ: కరోనా కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ఫార్మా కంపెనీలతో ప్రధాని విస్తృత చర్చలు జరుపుతున్నారని వెల్లడించారు. భారత్‌ బయోటెక్‌ ఐదు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. డిసెంబర్‌ నాటికి 15 కోట్ల 50 లక్షల డోసుల ఉత్పత్తి జరుగుతుందని కిషన్‌రెడ్డి వివరించారు.

చదవండి: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
మహారాష్ట్రలో 52 మందిని బలిగొన్న బ్లాక్‌ ఫంగస్‌

మరిన్ని వార్తలు