మూడు శాఖల నిర్వహణ నాకొక ఛాలెంజ్‌: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

24 Aug, 2021 13:27 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. మూడు శాఖల నిర్వహణ ఓ ఛాలెంజ్‌ అని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అన్ని చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఆ రాష్ట్రాల్లో అభివృద్ధి, పనుల పురోగతిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. కాగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని.. ఆటంకాలన్నీ తొలగిపోయాయని, మరింత మెరుగుపర్చేందుకు తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తానని  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.

చదవండి: ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం: రాహుల్‌ గాంధీతో సీఎం భేటీ

మరిన్ని వార్తలు