గొంతులో ఇరుక్కున్న 14 సెం.మీ. కత్తి

3 Feb, 2021 20:07 IST|Sakshi

భోపాల్‌: కంట్లో నలుసు పడితేనే కొద్ది క్షణాల పాటు ఉక్కిరి బిక్కిరి అవుతాం. అలాంటిది గొంతులో ఓ కత్తి దిగితే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే కష్టంగా అనిపిస్తోంది కదూ! కానీ మధ్యప్రదేశ్‌లో అచ్చంగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఛత్తర్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి పద్నాలుగు సెంటిమీటర్ల పొడవున్న కత్తిని గుటుక్కుమని మింగేశాడు. దాన్ని మింగేటప్పుడు ఎక్కడా గుచ్చుకోలేదు కానీ, తిన్నగా ఆహారనాళంలోకి ప్రవేశించాక మొదలైంది అసలు సమస్య. (చదవండి: అయ్యో పాపం.. మీకు చేతులెలా వచ్చాయి)

గుటక వేస్తే చాలు కత్తి కొన త్రిశూలంలా గొంతును పొడుస్తోంది. ఈ బాధను తాళలేకపోయిన సదరు వ్యక్తిని భోపాల్‌లోని ఎయిమ్స్‌లో చేర్పించారు. అక్కడి వైద్యులు జనవరి 26న అత్యవసర శస్త్రచికిత్స చేసి ఆహార నాళంలో ఉండిపోయిన కత్తిని తీసివేశారు. ఈ విషయాన్ని వైద్యులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. అయితే అతడు ఇలా ఏది పడితే దాన్ని గుటకాయ స్వాహా అనిపించడం కొత్తేమీ కాదు. రెండేళ్ల క్రితం కూడా అతడు పలు వస్తువులను మింగేయగా ఎయిమ్స్‌ వైద్యులు వాటిని పొట్టలో నుంచి బయటకు తీశారు. (చదవండి: సమ్మర్‌ స్పెషల్‌: చిరిగినదానికి ఇంత ఖరీదా?)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు