పద్మభూషణ్‌ అందుకున్న కృష్ణ ఎల్ల దంపతులు

29 Mar, 2022 08:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో సేవలు చేసినవారికి అందజేసే పద్మ అవార్డుల రెండో విడత ప్రదానోత్సవం సోమవారం రాష్ట్రపతిభవన్‌లో జరిగింది. మార్చి 21న తొలి విడతలో 54 మందికి అవార్డులు ఇవ్వగా.. సోమవారం 74 మందికి పురస్కారాలు అందజేశారు. అందులో నలుగురు తెలుగువారు ఉన్నారు. భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్ల, ఆయన సతీమణి సుచిత్ర ఎల్ల ఇద్దరికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందజేశారు.

కూచిపూడి నాట్య కళాకారిణి గడ్డం పద్మజారెడ్డి, కోయ కళాకారుడు సకిని రామచంద్రయ్య కూడా పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం పద్మజారెడ్డి, రామచంద్రయ్య ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పద్మశ్రీ అవార్డు తనకు మహాశివుడు ఇచ్చిన వరమని, దీనిని తన నాట్య గురువు దివంగత శోభానాయుడుకు అంకితం చేస్తున్నానని పద్మాజారెడ్డి చెప్పారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆదివాసీ కథలే తనను ఈ స్థాయికి తెచ్చాయని సకిని రామచంద్రయ్య అన్నారు. 

(చదవండి: గూర్ఖాల్యాండ్‌ డిమాండ్‌ను వదిలిన మోర్చా)

మరిన్ని వార్తలు