Photographer Krishnamurthy: చిన్న ఫోటోగ్రాఫర్‌...అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతికే వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌గా

27 May, 2022 09:25 IST|Sakshi

పావగడ: తాలూకాలోని ఓబుళాపుర గ్రామంలో ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన కృష్ణమూర్తి, నాగరత్నమ్మ దంపతుల కుమారుడు వై కే లోకనాథ్‌ ఫొటోగ్రఫీ రంగంలో ఉన్నత స్థానానికి ఎదిగాడు. చిన్నపాటి ఫొటోగ్రాఫర్‌గా వృత్తిని ప్రారంభించిన ఆయన నేడు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వ్యక్తిగత ఫొటో గ్రాఫర్‌గా ఎదిగాడు. బెంగుళూరులో కలర్‌ ల్యాబ్‌ నిర్వహిస్తున్న అతని చిన్నాన్న ఎంసీ గిరీశ్‌ ప్రేరణతో ప్రభుత్వ చలనచిత్ర, జయచామరాజేంద్ర పాలిటెక్నిక్‌లో చేరారు.

1989లో డిప్లొమా పూర్తి చేశాడు. ప్రసార భారతి ఛానల్‌లో విధులు నిర్వహించాడు. తదనంతరం ఢిల్లీలో అడుగు పెట్టి ఛాయాగ్రహ వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగి చివరకు ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ఛాయాగ్రాహకుడిగా ఎంపికయ్యాడు. రెండు దశాబ్దాల పాటు ప్రధాని కార్యాలయంలో విధులు నిర్వహించిన ఆయన ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌గా రాష్ట్రపతి భవన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అతని ఎదుగుదల పట్ల గ్రామస్థులు, బంధువులు, స్నేహితులు హర్షం ప్రకటించారు. 

(చదవండి: ‘మాజీ ప్రధానితో సీఎం కేసీఆర్‌ భేటీ.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త’)

మరిన్ని వార్తలు