భాష వివాదంపై మంత్రి కేటీఆర్‌ స్పందన

6 Jun, 2021 18:03 IST|Sakshi

మాతృభాషలో మాట్లాడం భారతీయుల హక్కన్న మంత్రి 

హైదరాబాద్‌ : కేరళా నర్సుల వివాదంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. రాజ్యాంగం తెలుగు, తమిళ్‌, మళయాళం ఇలా మొత్తం 22 భాషాలను అధికారిక భాషలుగా గుర్తించదని చెప్పారు. తమకు సౌకర్యంగా ఉన్న భాషలో మాట్లాడుకోవడం భారతీయుల హక్కని ఆయన అన్నారు. ఫలానా భాషలోనే మాట్లాడాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 

ఇదీ వివాదం
ఢిల్లీలోని జిప్‌మర్‌లో పనిచేసే మలయాళీ నర్సులు తమ మాతృభాషలో మాట్లాడకూడదంటూ జూన్‌ 5న జిప్‌మర్‌ యాజమాన్యం సర్క్యులర్‌ జారీ చేసింది. కేరళా నర్సులు ఇకపై ఇంగ్లీష్‌ లేదా హిందీలో మాత్రమే సంభాషించాలంటూ ఆ సర్య్కులర్‌లో పేర్కొంది. దీనిపై మళయాళీ నర్సులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా చేయడం తమ మాతృభాషను అవమానించడమే అవుతుందన్నారు. జిప్‌మర్‌ యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్‌ని  తీవ్రమైన చర్యగా అభివర్ణిస్తూ లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్‌ చేశారు. 

ఇక్కడ చదవండి: 'మా భాషను అవమానించారు.. క్షమాపణ చెప్పాల్సిందే'
వెహికల్‌ ఇంజన్లకు ఇథనాల్‌ టెన్షన్‌

>
మరిన్ని వార్తలు