Kumbh Mela 2021: కుంభమేళాలో కరోనాతో జాగ్రత్త 

22 Mar, 2021 12:48 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కొనసాగుతున్న కుంభమేళా వల్ల కరోనా వ్యాపిస్తోందని, కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం.. ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి లేఖ రాసింది. కుంభమేళాలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌కు చెందిన బృందం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హరి ద్వార్‌లో ఈ నెల 16–17 మధ్య పర్యటించింది.

కుంభమేళా జరిగిన షాహి స్నాన్‌ రోజుల తర్వాత స్థానికుల్లో ఉన్నట్టుండి కరోనా కేసులు పెరిగాయని తెలిపింది. కుంభమేళాకు కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. అవసరమైన మేర టెస్టులు చేయాలని, ప్రభుత్వం విడుదల చేసిన కరోనా మార్గదర్శకాలను పాటించాలని చెప్పింది. కొత్త కేసుల్లో వేగం కనిపిస్తే వెంటనే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు శాంపిల్స్‌ పంపాలని కోరింది.    

చదవండి:
జనతా కర్ఫ్యూకి ఏడాది

‘నిర్లక్ష్యం చేస్తే సెకండ్‌ వేవ్ నుంచి ఎవరూ కాపాడలేరు’

మరిన్ని వార్తలు