చీతాల రాకతో...భయాందోళనలతో బెంబేలెత్తుతున్న గ్రామస్తులు

18 Sep, 2022 13:08 IST|Sakshi

మధ్యప్రదేశ్‌: నరేంద్రమోదీ పుట్టిన రోజు పురస్కరించుకుని చీతా(చిరుత పులుల్లో ఒక రకం) ప్రాజెక్టులో భాగంగా ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ నేషనల్‌ పార్క్‌ సమీపంలో గ్రామాల్లోని ప్రజలు ఈ చిరుతల రాకతో భయాందోళనకు గురవుతున్నారు. మరికొంతమంది ఈ చిరుత కారణంగా పర్యాటకుల తాకిడి ఎక్కువవుతుందని, అందువల్ల ఉపాధి దొరుకుతుందని భావిస్తున్నారు. కానీ చాలామంది గ్రామస్తులు తమ భూములను లాక్కుంటారేమోనని భయపడుతున్నారు.

ఈ చిరుతుల రాక మధ్యప్రదేశ్‌లోని షియాపూర్‌ జిల్లా పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తుల్లో లేని భయాలను రేకెత్తించింది. వారిలో ఈ భయాందోళనలకు కారణం...గతంలో సుమారు నాలుగు నుంచి ఐదు గ్రామాలను పార్కు కోసం మార్చడం, అలాగే సుమారు 25 గ్రామాల ప్రజలను తరలించడం వంటివి జరిగాయి. దీంతో వారు తమ భూములను, నివాసాలను కోల్పోయి..ఆర్థికంగా దెబ్బతిన్నారు. అంతేకాదు ఆ గ్రామానికి సమీపంలోని ఆనకట్ట ప్రాజెక్టు కారణంగా కూడా ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోతారని రామ్‌కుమార్‌ గుర్జార్‌ అనే మరో రైతు చెబుతున్నాడు.

మీ గ్రామానికి సమీపంలోని పార్కుల్లో చిరుతల రాక గురించి గ్రామస్తుల అభిప్రాయం గురించి ప్రశ్నించగా... జాతీయ ఉద్యానవనం కోసం గ్రామాలను లాక్కున్నారు. ఇప్పుడూ సమీపంలోని కునో నదిపై ఆనకట్ట ప్రాజెక్లు నిర్మించనున్నారు...ఇది మరో 50 గ్రామాలపై ప్రభావం చూపుతుంది. ఈ నేషనల్‌ పార్క్‌ల వల్ల పర్యాటకులు పెరిగినప్పటికీ....ధనవంతులే వ్యాపారాలు నిర్వహించుకుంటారని, తమకు ఉపాధి దొరకదని అంటున్నారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్ల కోసం తమ భూములను లాక్కుంటారని గ్రామస్తులు ఆవేదనగా చెబుతున్నారు. 

(చదవండి: కునో పార్కులో చీతాలను వదిలిన ప్రధాని మోదీ, స్వయంగా ఫోటోలు తీస్తూ..)

మరిన్ని వార్తలు